వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, జబర్దస్త్ రోజా.. ఆ పార్టీకి దూరమవుతున్నారా? ఇక, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా తన మకాం.. తమిళనాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గత రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే.. దీనికి నిన్న మొన్నటి వరకు ప్రత్యేకంగా ఆధారాలు లభించలేదు. దీంతో ఇది నిజమో కాదో.. అన్న చర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో రోజా ఇక, జగనన్నకు గుడ్ బై చెప్పేసినట్టేనని అంటున్నారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019లో విజయం దక్కించుకున్న రోజా.. మంత్రిగా కూడా రెండేళ్లపాటు అవకాశం చిక్కించుకున్నారు. కానీ, రాష్ట్రంలో మారిన రాజకీయ వాతావరణం.. పైగా కూటమి దూకుడుతో వైసీపీ పుంజుకునేలా కనిపించడం లేదని సీనియర్లు చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో రోజా కూడా.. కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. పైగా తమిళనాడులోనే ఎక్కువగా ఉంటున్నారు. అక్కడి ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పైగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ను తరచుగా రోజా దంపతులు కలుస్తుండడం.. అక్కడి సంక్షేమ కార్యక్ర మాలకు చెక్కుల రూపంలో సాయం చేస్తుండడం కూడా.. తెలిసిందే. ఇక, ఇప్పుడు డీఎంకేలో చేరేందుకు రోజా మార్గం సుగమం చేసుకున్నారనేది చర్చగా మారింది. వైసీపీకి అందుకే దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. దీనికి దన్నుగా.. ఎప్పుడూ తన సోషల్ మీడియా మాధ్యమాలైన.. ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్‌లలో జగన్ ఫొటోలు, వైసీపీ జెండాలను ఆమె తీసేశారు.
నిన్న మొన్నటి వరకు కూడీ డీపీలుగా ఆమె వైసీపీ అధినేత జగన్ ఫొటోలను, జెండాలను పెట్టుకున్నారు. కానీ, రెండు రోజులుగా ఆమె వైఖరి మారిపోయింది. తాజాగా ఆమె డీపీలను మార్చేసి.. పూర్తిగా తన పేరును మాత్రమే పెట్టుకున్నారు. ఎక్కడా వైసీపీ అన్న పేరు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ పరిణామాలతో ఇక, రోజా.. పార్టీ మార్పు ఖాయమైందనే చర్చకు బలం చేకూరింది. ఆమె భర్త సెల్వమణికి తమిళనాడు నేపథ్యం ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన అగ్రదర్శకుడు కూడా. ఈ నేపథ్యంలోనే రోజా తన రాజీకయ రైలు బండిని రూటు మార్చుకునేలా చేశారని తెలుస్తోంది.
This post was last modified on August 29, 2024 11:22 pm
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…