చిత్తూరు మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు రెడ్డప్పకు రాజంపేట ప్రస్తుత ఎంపీ, సీనియర్‌నేత మిథున్‌రెడ్డి భారీ కానుకనే అందించారు. సుమారు 20 లక్షల రూపాయల విలువైన కారును ఆయన బహూకరించారు. ఈ నెల తొలి వారంలో మిథున్‌రెడ్డి.. రెడ్డప్పను పలకరించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సమ యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా.. అక్కడకు చేరుకున్నారు.
దీంతో ఇరు పక్షాల మధ్య వివాదాలు, రగడ చోటు చేసుకుని.. రెడ్డప్ప ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలో రెడ్డప్ప కారు సహా కొన్ని చిన్నపాటి వాహనాలు కూడా దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. రెడ్డప్ప కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా బుగ్గయింది. ఈ పరిణామాల క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి సదరు కారును బహూకరించినట్టు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం.. రెడ్డప్ప ఇంటికి వెళ్లిన మిథున్‌రెడ్డి ఆయనకు ఈ కారు తాళాలను అందించారు.
ఇదిలావుంటే.. నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం ఇంకా కొలిక్కిరాలేదు. ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తత లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. అయితే.. ఎవరికి వారు .. తమ తప్పు లేదని వాదించుకుంటున్నారు. మరోవైపు, వైసీపీ నాయకులు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు విధించిన ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో వారు బయటకు రావడం లేదు. ఏదైనా అత్యవసర పనిపై వచ్చినా.. పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. తాజాగా మిధున్ రెడ్డి కూడా.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చే రెడ్డప్ప ఇంటికి రావడం గమనార్హం.
This post was last modified on August 29, 2024 10:29 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…