గత కొంత కాలంగా మెగా అభిమానులకు, అల్లు అర్జున్‌కు మధ్య పెద్ద అగాథం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంపై మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు.
ఓ వైపు మెగా ఫ్యామిలీలో అందరూ జనసేనకు అండగా ఉంటే.. బన్నీ మాత్రం ఫ్రెండు అని చెప్పి వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడాన్ని జనసేన మద్దతుదారులు, మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీనిపై అప్పట్నుంచి సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
ఇటీవల మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన పరోక్ష వ్యాఖ్యలతో ఈ వివాదం ఇంకా ముదిరింది. ఇంతలో ఈ వ్యవహారంలోకి జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. ‘‘నాకు ఇష్టమైతే వస్తా.. ఫ్రెండు కోసం వస్తా’’ అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
అల్లు అర్జున్ ఏమైనా పుడుంగి అనుకుంటున్నాడా.. అతను వస్తే ఏంటి రాకపోతే ఏంటి.. జనసేన 21కి 21 సీట్లలో గెలిచింది.. బన్నీ ప్రచారం చేసి పెట్టిన శిల్పా రవి గెలిచాడా.. అసలు అల్లు అర్జున్‌కు సొంతంగా ఫ్యాన్స్ ఉన్నారా.. అంటూ రెచ్చిపోయి మాట్లాడేశారు. ఈ వ్యాఖ్యలతో అల్లు అర్జున్‌కు.. మెగా ఫ్యామిలీకి, అభిమానులకు మధ్య ఇంకా పెరిగినట్లయింది.
వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. బన్నీని మరీ ఆ స్థాయిలో బొలిశెట్టి శ్రీనివాస్ టార్గెట్ చేయాల్సింది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేశారు.
బన్నీ చేసిన కామెంట్స్ మీద తనను మీడియా వాళ్లు స్పందించమంటే ఆ వ్యాఖ్యలే చేశానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు శ్రీనివాస్. జనసేనకు, బన్నీకి మధ్య శతృత్వం ఏమీ లేదని.. అతను మాట్లాడకుంటే తానూ మాట్లాడేవాడిని కాదని.. ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on August 29, 2024 10:39 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…