ఔను.. మీరు చదివింది నిజమే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పర్యటన నిమిత్తం తాను రూ.4,230 ఖర్చు పెట్టానని.. ఆ సొమ్మును తిరిగిఇప్పించాలని కోరుతూ.. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి ఓ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు. తాజాగా వారధి పేరుతో బీజేపీ ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మండలం, రాయపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ కాటమనేని కల్యాణి ఫిర్యాదు చేశారు.
ఏం జరిగింది?
గత వైసీపీ హయాంలో సర్పంచులు తమ సొంత నిధులు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా దక్కలేదు. ఈ క్రమంలో అభివృద్దితోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా సర్పంచులు ఖర్చు చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సర్పంచ్ కల్యాణి.. తన ఫిర్యాదును పురందేశ్వరికి అందించారు. తమ గ్రామంలో నిర్వహించిన కేంద్ర మంత్రి సీతారామన్ సభకు ప్రొటోకాల్ ఖర్చులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గొల్లపూడి మండలం రాయనపాడు గ్రామంలో 2023, డిసెంబర్ 9న కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వికసిత్ భారత్ సభలో పాల్గొన్నారు. ఈసందర్బంగా అప్పటి కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాలు మేరకు రూ.4,230 అప్పు చేసి ఖర్చు చేశానని కల్యాణి తెలిపారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఒక్క నయాపైసా కూడా చెల్లించ లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సొమ్మును తనకు తిరిగి ఇప్పించాలని.. వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పురంధేశ్వరి ప్రస్తుత కలెక్టర్ కు వెంటనే ఫోన్ చేసి కల్యాణి విన్నపాన్ని స్పెషల్ కేసు గా పరిగణిం చాలని, సొమ్ములు అందించాలని కోరారు. దీనికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అంగీకారం తెలిపారు. అయితే… ఇంత చిన్న ఎమౌంటుకే ఫిర్యాదా? అని సందేహాలు రావొచ్చు. కానీ, వైసీపీ హయాంలో సర్పంచులు ఆర్థికంగా ఎంతగా నలిగిపోయారన్న దానికి ఈ కేసు ఉదాహరణ. అందుకే ఇది హైలెట్ అయింది. మరి కల్యాణికి న్యాయం జరుగుతుందనే ఆశిద్దాం.
This post was last modified on August 29, 2024 10:26 pm
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…