ఏపీ రాజధాని అమరావతి.. ఇక ఏఐ నగరంగా అవతరించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కేంద్రం గా మారనుంది. ప్రస్తుత ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే 10 ఏళ్లలో అన్ని ప్రాంతాలు, నగరాలు, రాష్ట్రాలు కూడా.. ఏఐని అందిపు చ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా.. ఏఐలోనే లభించనున్నాయి. దీనిని ముందుగానే గుర్తించిన సీఎం చంద్రబాబు తాజాగా.. అమరావతిని ఏఐ సిటీగా పేర్కొంటూ తీర్మానం చేశారు.
గురువారం అమరావతిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో చంద్రబాబు రాజధాని నగరాన్ని ప్రపం చ దేశాలకు చేరువ చేయాలంటే..ఏఐ మంత్రాన్ని పఠించాలని అధికారులకు సూచించారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుకు వచ్చేలా అమరావతి లోగో ఉండాలని పేర్కొన్నారు. రాజధాని పేరులో ఇంగ్లీష్‌లో మొదటి అక్షరం A, చివరి అక్షరం I కలిసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on August 29, 2024 10:24 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…