ఒకవైపు సీఎం చంద్రబాబు మొత్తుకుంటున్నారు. పద్ధతిగా వ్యవహరించాలని పార్టీ ఎమ్మెల్యేలకు గీతోప దేశం చేస్తున్నారు. పరువు తక్కువ పనులు చేయొద్దని కూడా చెబుతున్నారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో అయితే.. చాలా సీరియస్ కామెంట్లే చేశారు. పద్దతిగా ఉండాలని.. ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పనులు చేయొద్దని కూడా చెప్పారు. మరి బాబు ఇంతగా చెబుతున్నా.. తమ్ముళ్లు ఎక్కడా పాటిస్తున్నట్టు కనిపించడం లేదు.
తాజాగా ఓ పేరు మోసిన రౌడీషీటర్ బర్త్‌డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే పాల్గొని సందడి చేశారు. ఏకంగా రౌడీ షీటర్ కు కేకు తినిపించి.. సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు.. ఫస్ట్ విషెస్ తానే చెబుతానంటూ.. పోటీ పడిమరీ ఈ తమ్ముడు హంగామా సృష్టించారు. కానీ, ఆయన పాల్గొన్నది ఏ సమాజ సేవ చేసిన వ్యక్తి పుట్టినరోజు కాదన్న విషయాన్ని ఆయన ఎందుకు మరిచిపోయారనేది ప్రశ్న. దీంతో ప్రస్తుతం ఈ టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్న టీడీపీ నాయకుడు గోండు శంకర్. ఈయనకు తొలిసారి చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే.. ఆయన మాత్రం.. ఫక్తు పేరు మోసిన రౌడీషీటర్లతో సావాసం చేస్తున్నారు. తాజాగా రౌడీ షీటర్ గబ్బర్ పుట్టిన రోజు వేడుకలకి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంతేకాదు.. స్వయంగా కేక్ తినిపించిన ఎమ్మెల్యే శంకర్.. ఆయనను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఇక, శ్రీకాకుళం నియోజకవర్గంలో గబ్బర్ గురించి తెలియనివారు.. ఆయన ఫొటోలేని పోలీసు స్టేషన్ లేదంటే.. ఆశ్చర్యం వేస్తుంది. గతంలో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావుకు ఈయన రైట్ హ్యాండ్. ఎన్నికలకు ముందు.. టీడీపీకి జైకొట్టి.. శంకర్ పంచన చేరిపోయారు. అంతేకాదు.. ధర్మాన పేరు చెప్పి చేసిన అరాచకాలకు లెక్కేలేదని అంటారు. గతంలో వీరి అకృత్యాలు భరించలేక… ప్రజలు, అప్పటి ప్రతిపక్షాలతో కలిసి నగర బంద్ ను కూడా నిర్వహించారు.
అప్పటి ప్రతిపక్ష పార్టీ.. ఇప్పటి అధికార పక్ష ఎమ్మెల్యే ఇలా రౌడీషీటర్ల పుట్టినరోజు వేడుకల్లో సందడి చేయడాన్ని కేకులు కట్ చేసి కేకలు పెట్టడాన్ని ఎలా చూడాలి. అది కూడా చంద్రబాబు హెచ్చరించి 24 గంటలు కూడా కాకుండానే ఇలా రౌడీ షీటర్లతో ఫొటోలకు ఫోజులు ఇచ్చి.. కేకులు కట్ చేసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న వారిని ఏమనాలి? మరి ఇలాంటి వారిని ఎలా దారికి తీసుకురావాలో చంద్రబాబు ఆలోచించుకోవాలి.
This post was last modified on August 29, 2024 2:50 pm
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…