Political News

మాజీ సీఎంల కుమార్తెలు.. జైలు జీవితాలు తెలుసా?

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌విత‌.. 5 నెల‌ల‌కు పైగా తీహార్ జైల్లో గ‌డిపి తాజాగా సుప్రీంకోర్టు బెయిల్‌తో బ‌యటకు వ‌చ్చారు. ఢిల్లీలో మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణానికి సంబంధించి సౌత్ గ్రూప్‌తో చేతులు క‌లిపి.. రూ.100 కోట్ల మేర‌కు ఆప్ నాయ‌కుల‌కు అందించార‌నేది క‌విత‌పై ఉన్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలో ఆమె ఆధారాల‌ను  కూడాధ్వంసం చేశార‌ని.. ఫోన్ల‌ను ఫార్మాట్ చేశార‌ని.. అదేవిధంగా సాక్షుల‌ను కూడా ప్ర‌భావితం చేశార‌న్న‌ది.. ఈడీ, సీబీఐ చేసిన ఆరోప‌ణ‌లు. ఈ క్ర‌మంలోనే ఆమెను మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌తో మార్చి 15న అరెస్టు చేసి.. జైల్లో పెట్టారు. తాజాగా ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చారు.

అయితే.. క‌విత గురించి ఒక ప్ర‌త్యేక చ‌ర్చ‌సాగుతోంది. ఇక‌, రాజకీయంగా ఆమె యాక్టివ్‌గా ఉండ‌లేర‌న్న‌ది కొంద‌రు విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. కానీ, ఇది స‌రికాదు. ఎందుకంటే.. ఈ దేశంలో మాజీ ముఖ్య‌మంత్రుల కుమార్తెలు ప‌లు కీల‌క కేసుల్లో చిక్కుకోవ‌డం.. జైళ్ల‌కు వెళ్ల‌డం.. బెయిల్‌పై తిరిగి రావ‌డం.. రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి తిరిగి ప్ర‌జాక్షేత్రంలో విజ‌యం ద‌క్కించుకోవ‌డం కొత్త‌కాదు. ఇటీవ‌ల కాలంలో అంటే… గ‌డిచిన రెండు ద‌శాబ్దాల కాలాన్నితీసుకుంటే.. ఇద్ద‌రు కీల‌కమాజీ ముఖ్య‌మంత్రుల కుమార్తెలు.. జైళ్ల‌లో ఉన్నారు. కీల‌క కేసుల్లో చిక్కుకున్నారు. కానీ, బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.

క‌నిమొళి:  త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి , దివంగ‌త క‌రుణానిధి గారాల ప‌ట్టి క‌నిమొళి. కానీ, 2007-2010 మ‌ధ్య ఆమె ఏకంగా అండ‌మాన్ జైల్లో ఉన్నారు. దీనికి కార‌ణం.. అప్ప‌టి మ‌న్మోహ‌న్ సింగ్ స‌ర్కారులో వెలుగు  చూసిన `2జీ` స్పెక్ట్ర‌మ్ కుంభ‌కోణం. అప్ప‌టి కేంద్ర స‌మాచార మంత్రిగా డీఎంకే ఎంపీ రాజా వ్య‌వ‌హరించారు. ఈయ‌న‌తో చేతులు క‌లిపిన క‌నిమొళి.. 2జీ స్పెక్ట్ర‌మ్ కుంభ‌కోణానికి కీల‌క పాత్ర పోషించార‌న్న‌ది.. అప్ప‌టి సీబీఐ ఆరోప‌ణ‌. దీంతో ఆమెను అరెస్టు చేసి ఏకంగా అండ‌మాన్ జైల్లో ఉంచారు. సుదీర్ఘ‌కాలంత‌ర్వాత‌.. క‌రుణానిధి దిగి వ‌చ్చి.. కాంగ్రెస్‌తో చేతులుక‌లిపేందుకు తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఆమెకు బెయిల్ ల‌భించింది. ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌నిమొళి ఎంపీగా గెలిచారు.

మీసా భార‌తి:  బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమార్తె. ఈమె ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే.. ఆమె తండ్రి గ‌డ్డి కుంభ‌కోణంలో జైలుకు వెళ్లిన త‌ర్వాత‌.. ప్ర‌సాద్ స‌తీమ‌ణి ర‌బ్రీదేవి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఈ క్ర‌మంలో చోటు చేసుకు న్న ఉద్యోగాల కోసం.. భూములు తీసుకున్నార‌న్న కుంభ‌కోణం వెలుగు చూసింది. ఈ కేసులో మీసా భార‌తి మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు రావ‌డంతో సీబీఐ రంగంలోకి దిగికేసులు న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలో ఆమెను అరెస్టు చేసి.. జైలుకు త‌ర‌లించింది. కేవ‌లం 5 రోజులు మాత్ర‌మే ఆమె జైల్లో ఉండి.. బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఎంపీగా విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర‌చుగా మోడీ స‌ర్కారుపైనా.. వ్య‌క్తిగ‌తంగా మోడీపైనా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఉంటారు. సో.. ఈ దేశంలో ముఖ్య‌మంత్రుల కుమారులే కాదు..(హేమంత్ సొరేన్(జార్ఖండ్‌), జ‌గ‌న్‌(ఏపీ)) కుమార్తెలు కూడా జైలు జీవితాలు గ‌డిపిన వారు ఉండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 28, 2024 10:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుప్రీం లోనూ కేటీఆర్ కు బిగ్ షాక్!

బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…

19 minutes ago

ఆ సినిమాను డిస్కౌంట్లో అయినా చూస్తారా?

క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు…

19 minutes ago

బ్రాహ్మ‌ణికి లోకేష్ రూ.1300 కానుక‌.. స‌తీమ‌ణి రియాక్ష‌న్ ఇదే!

సంక్రాంతి పండుగ అంటేనే అంద‌రికీ వేడుక‌. క‌లవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. క‌నీసంలో క‌నీసం..…

34 minutes ago

45 కోట్లతో మొదటి సిక్సర్ కొట్టిన వెంకీ

రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…

49 minutes ago

ఎన్నికల వేళ కేజ్రీ కి ఈడీ చిక్కులు?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)…

55 minutes ago

మిడిల్ క్లాస్ దర్శకుడి వెరైటీ ప్రయోగం

క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత…

2 hours ago