పరామర్శలు వేరు.. పరిహారం వేరు. ఈ రెండింటికి మధ్య సున్నితమైన తేడా ఉంది. అయితే.. దీనిని చెరిపేసినట్టుగా వ్యవహరించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. తాజాగా ఆయన అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన ఘోర దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి భరోసా ఇవ్వాల్సిన జగన్.. దానిని తగ్గించి.. మీకు పరిహారం అందిందా
అని ప్రశ్నించారు.
దీనికి సహజంగానే కొందరు ఇంకా అందలేదని సమాధానం చెప్పారు. మరికొందరు.. ఎంతిస్తారో.. స్ఫష్టత లేదన్నారు. నిజానికి.. ఘటన జరిగిన తర్వాత.. బాధితుల వివరాలు తెలియాలి. ఇంకా దానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రభుత్వానికి రాలేదు. ఆ సమాచారం రాగానే.. వారి వారి అకౌంట్లలో సదరు నగదును వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇదే సమయంలో నకిలీలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని భావించి.. క్షేత్రస్థాయిలో తహసీల్దార్‌కు బాధ్యతలు కూడా అప్పగించింది.
కలెక్టర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఇచ్చిన నివేదికను ఒకటికి రెండు సార్లు క్షుణ్నంగా పరిశీలించి.. బాధితులకు న్యాయం చేయాలని సర్కారు తలపోస్తోంది. కానీ, ఈ విషయాలను పక్కన పెట్టిన జగన్.. పరిహారాన్ని కాన్నర్ చేసుకుని.. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందకపోతే.. తానే నేరుగా వచ్చి ధర్నా చేస్తానని.. తన ధర్నాతో ప్రభుత్వం భయపడి మీకు పరిహారం ఇస్తుందని ఆయన చెప్పుకొ చ్చారు. కానీ, ఇలా వ్యాఖ్యానించడం సరికాదనే వాదన వినిపిస్తోంది.
ఎందుకంటే.. ముందు ఘటనకు సంబంధించి ఆయన బాధితులను ఓదార్చాలి. ఆ తర్వాత.. సెకండరీగా పరిహారం గురించి మాట్లాడాలి. పరిహారం ఇవ్వాల్సిందే. దీనిని ఎవరూ కాదనరు. కానీ, కేవలం పరిహారమే ముందు.. అన్నట్టుగా జగన్ మాట్లాడడం.. తాను వచ్చి ధర్నా చేస్తానని చెప్పడం చూస్తే.. హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 24, 2024 11:01 am
నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…