ప్రజానాయకుడు అనేటోడు ఎవరైనా సరే.. ప్రజల మధ్యనే ఉండాలి. వారి సమస్యల గురించి మాట్లాడాలి. వారికి జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తాలి. మొత్తంగా తాను ఉన్నానన్న విషయానని చెప్పే ప్రయత్నం చేస్తుండాలి.
కానీ.. అలాంటివేమీ లేకుండా.. పవర్ ఇస్తేనే పలుకరించేది.. పవర్ తీసేసుకున్న తర్వాత నాకేం పని అన్నట్లుగా పత్తా లేకుండా పోవటమే ప్రజానాయకుడి లక్షణమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
పదేళ్ల అధికారం తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు తీర్పు చెప్పిన వేళ.. ఆ పాత్రకు న్యాయం చేయాల్సిన అవసరం కేసీఆర్ మీద ఉండదా? అన్నది ప్రశ్న. ఇక్కడే కేసీఆర్ తీరు గురించి మాట్లాడుకోవాలి. గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి.
కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమాన్ని చూసినట్లైయితే.. ఆయన తనదైన టైం కోసం వెయిట్ చేయటం కనిపిస్తుంది. తన టైం వచ్చిందన్నంతనే వాయు వేగంతో నిర్ణయాలు తీసుకోవటం.. అమలు చేయటం చేస్తారు. అయితే.. ఇదంతా మొదటిసారి బాగుంటుంది. కానీ.. అదే వ్యూహాన్ని ఎప్పుడూ అమలు చేస్తానంటే వర్కువుట్ అయ్యే అవకాశం ఉండదు.
ఏపీలో చంద్రబాబును చూడండి. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు మొగ్గు చూపుతారు. తనను తాను ప్రజల మనిషిగా చూపించుకునేందుకు తపిస్తుంటారు. కేసీఆర్ లో మాత్రం ఆ గుణం కనిపించదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అయినా.. విపక్ష నేతగా అయినా తనను తాను లిమిట్ చేసుకోవటం కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా వ్యవహరించే వేళలోనూ.. అయితే ప్రగతిభవన్ లేదంటే ఫామ్ హౌస్ అన్నట్లే వ్యవహరించేవారు. దీనిపై విమర్శలు చెలరేగినా ఆయన పట్టించుకునే వారు కాదు.
ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి మూడునాలుగు సార్లు మాత్రమే హాజరయ్యారు. మొన్నటికి మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ.. బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన రోజున అసెంబ్లీకి వచ్చిన ఆయన.. రేవంత్ సర్కారుపై తాను యుద్ధం చేస్తానని.. కత్తి పట్టుకొని చెలరేగిపోతానంటూ చాలానే మాటలు చెప్పారు. ఆ వెంటనే ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని.. చెప్పిన మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా తనకు తాను మాత్రమే ముఖ్యమన్నట్లు.. తనకు తోచినట్లుగా వ్యవహరించే కేసీఆర్.. తనను తాను పరిమితం చేసుకుంటున్నారని చెప్పక తప్పదు.
మౌనాన్ని వ్యూహంగా చెప్పుకుంటూ.. ఫామ్ హౌస్ కు పరిమితం కావటం ప్రజానేతకు ఉండాల్సిన లక్షణమా? అన్నది ప్రశ్న. అదేదో.. ప్రజల మధ్య ఉండొచ్చు కదా? మైలేజీ కోసం నిత్యం మాట్లాడాలని చెప్పట్లేదు కానీ.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపటం లాంటి కనీస పనుల్ని కేసీఆర్ ఎందుకు చేయరు? అన్నది మరో ప్రశ్న. త్వరలోనే తెలంగాణ ప్రజల తరఫున పొడిచేస్తానంటూ అడ్డం పొడుగు మాటలు మాట్లాడిన కేసీఆర్.. తర్వాత పత్తా లేకుండాపోవటాన్ని మర్చిపోకూడదు. ఫామ్ హౌస్ లో వ్యవసాయాన్ని చూసుకుంటూ.. కొత్త పంటలు ఏమేం వేయాలన్న ఆలోచన చేస్తున్న కేసీఆర్ ను చూసినప్పుడు అనిపించేదొక్కటే.. సొంత ఫామ్ హౌస్ మీద ఉన్న ప్రేమ.. తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు ప్రదర్శించరు అని.
This post was last modified on August 22, 2024 1:30 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…