Political News

నువ్వు నోరు ఎత్తద్దు జ‌గ‌న్‌: ఏపీ మంత్రి

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌పై వైసీపీ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఫైర‌య్యారు. నీకు మాట్లాడే అర్హ‌త లేదు.. కొన్నిరోజులు నోరెత్త‌కుండా ఉంటే మంచిద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. జ‌గ‌న్ వంటి అస‌మ‌ర్థుడి కార‌ణంగా ఎదురైన దెబ్బ‌ల‌ను స‌ర్దుబాటు చేసుకునేందుకే త‌మ‌కు స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు విష‌యంపై తాజాగా జ‌గ‌న్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లుచేశారు. త‌మ హ‌యాంలో రెండు ట‌న్నెళ్ల‌ను పూర్తి చేశామ‌ని.. మిగిలిన అర‌కొర ప‌నులు పూర్తి చేసేందుకు చంద్ర‌బాబుకు మ‌న‌సు రావ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

జ‌గ‌న్ చేసిన ఈ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన గొట్టిపాటి.. తీవ్రంగా స్పందించారు. కొన్నాళ్ల పాటు జ‌గ‌న్ నోరెత్త‌కుండా ఉంటే బాగుంటుంద‌ని అన్నారు. అస‌లు ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది ఆయ‌నేన‌ని తెలిపారు. గతంలో చంద్రబాబు సూచనల మేర‌కు ప్రకాశం జిల్లా నేతలు క‌లిసి ఢిల్లీ వెళ్లామ‌ని, వెలిగొండ ప్రాజెక్టుకు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని కోరామ‌ని తెలిపారు. కానీ, ఆ స‌మ‌యంలో సీఎంగా ఉన్న జ‌గ‌న్‌.. అప్ప‌టి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో క‌లిసి.. ప్రాజెక్టును అడ్డుకున్నార‌ని, త‌ద్వారా ప్రాజెక్టుకు నోటిఫికేష‌న్ కూడా రాలేద‌ని తెలిపారు.

ఇప్పుడు నీతులు చెబుతున్నార‌ని గొట్టిపాటి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక్క వెలిగొండే ప్రాజెక్టే కాకుండా.. గుండ్లక‌మ్మ ప్రాజెక్టును కూడా నాశ‌నం చేశార‌ని విమ‌ర్శించారు. ఈ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన‌.. మూడేళ్ల‌యినా.. జగ‌న్ క‌నీసం స‌మీక్షించ‌లేద‌ని, గేటును తిరిగి పెట్టే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని దుయ్య‌బ‌ట్టారు. అప్ప‌టి బాధితులకు ప‌రిహారం కూడా పూర్తిగా ఇవ్వ‌కుండా వారిని వేధించార‌ని విమ‌ర్శించారు. పులిచింతల గేటు కొట్టుకుపోయినా ఇదే వైఖ‌రి అనుస‌రించార‌ని అన్నారు. ఇన్ని త‌ప్పులు చేసిన జ‌గ‌న్‌.. ఇప్పుడేదో నీతులు చెబుతున్నార‌ని.. కొన్నాళ్లు ఆయ‌న నోరు ఎత్త‌కుండా ఉంటే బాగుంటుంద‌ని తెలిపారు.

This post was last modified on August 21, 2024 7:17 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

20 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago