తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టాపన వ్యవహారం నిప్పు రాజేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారడంతో ఈ పరిణమాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియడం లేదు. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ది చేసింది.
ఈ లోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించి చకచకా ఏర్పాట్లు చేసి విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ విగ్రహం ఎలా పెడతారని, అక్కడ కాకుండా మరెక్కడ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.
తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తరువాత దానిని తొలగిస్తామని, గత పదేళ్లు అధికారంలో ఉన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈ సారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఇక తెలంగాణ కవులు, కళాకారులు, బుద్దిజీవులు, రచయితలు, పాత్రికేయుల పక్షాన ఏకంగా రాహుల్ గాంధీకి బహిరంగలేఖ రాయడం ఈ సంధర్భంగా కొత్త చర్చకు దారితీసింది. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ సాంస్కృతిక ఆశయాలను గౌరవిస్తామని హామీ ఇచ్చారని, తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణవాదుల మనోభావాలను గాయపరచడమేనని, అక్కడ కాకుండా మరో చోట విగ్రహం పెట్టుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎటు దారితీస్తుందో అన్న చర్చ నడుస్తున్నది.
This post was last modified on August 20, 2024 10:10 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…