Political News

మూడు రోజులు ఢిల్లీలోనే చంద్ర‌బాబు.. జ‌గ‌న్‌పై చ‌ర్చ‌!?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం.. ప‌లు వ్యాపార వేత్త‌ల‌తో అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో భేటీ అయిన చంద్ర‌బాబు.. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టే అంశంపై వారితో చ‌ర్చించారు. వీరిలో ప్ర‌ఖ్యాత టాటా గ్రూపు చైర్మ‌న్ న‌ట‌రాజ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్‌ కూడా ఉండ‌డం విశేషం. ఇక‌, ఈ కార్య‌క్ర‌మాల అనంత‌రం.. చంద్ర‌బాబు సాయంత్రం ఢిల్లీకి ప్ర‌త్యేక విమానంలో చేరుకున్నారు. శుక్ర‌వారం, శ‌నివారం, ఆదివారం సాయంత్రం వ‌ర‌కు కూడా ఆయ‌న ఢిల్లీలోనే ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో చంద్ర‌బాబు భేటీ కానున్నారు.

శుక్ర‌వారం రాత్రికి ఢిల్లీలో అడుగు పెడుతూనే కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి పాటిల్‌తో చంద్ర‌బాబు భేటీ అవుతారు. కీల‌క‌మైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిధులపైనా ఆయ‌న చర్చించనున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ప‌నులు, ఇప్ప‌టికే పెండింగులో ఉన్న నిధుల అంశాల‌ను కూడా తేల్చుకోనున్నారు. అనంతరం టీడీపీ ఎంపీలు ఇచ్చే విందులో చంద్ర‌బాబు పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా కూడా చంద్ర‌బాబు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై వారితో చ‌ర్చించనున్నారు. అన్న క్యాంటీన్ల‌కు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నుంచి విరాళాలు సేక‌రించే కార్య‌క్ర‌మంలో వారిని కూడా భాగ‌స్వామ్యం చేయ‌నున్నారు.

ఇక, శ‌నివారం ఉద‌యం పార్టీ ఎంపీల‌తో చంద్ర‌బాబు భేటీ అయి.. జాతీయ రాజ‌కీయాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం.. ఢిల్లీలోని తెలుగు వారితోనూ చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. దాదాపు 40 నిమిషాల‌పాటు మోడీ ఆయ‌న‌కు స‌మ‌యం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి నిర్మాణానికి ఇటీవ‌ల బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన రూ.15 వేల కోట్ల సాయం స‌హా.. వెనుక బ‌డిన జిల్లాలకు సాయంపైనా చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితిని వివ‌రించి.. ఎక్కువ మొత్తంలో ప‌న్నుల్లో వాటా తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌నున్నారు.

శ‌నివారం రాత్రి 7 గంటలకు లేదా.. 9 గంట‌ల‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్ర‌బాబు భేటీ అవుతారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ వ్య‌వ‌హారం.. ఇటీవ‌ల జ‌గ‌న్ ఢిల్లీలో చేసిన ధ‌ర్నా, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు, వైసీపీ నేత‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే అంశాల‌పైనా అమిత్‌షాతో చంద్ర‌బాబు చ‌ర్చించ‌నున్నారు. ఇటీవ‌ల వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. అమిత్‌షాను క‌లిసి.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు చేయ‌డం..త‌మ‌కు, త‌మ నాయ‌కుడికి భ‌ద్ర‌త త‌గ్గిస్తున్నార‌ని చెప్పిన నేప‌థ్యంలో షాకు.. వాస్త‌వ ప‌రిస్థితిని చంద్ర‌బాబు వివ‌రించ‌నున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి.

This post was last modified on August 17, 2024 9:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

27 minutes ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

3 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

4 hours ago