ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను పోలీసులు అరెస్టు చేయడం, ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన నారా లోకేష్.. జోగి కొడుకు తప్పు చేశాడని.. అలాంటి వ్యక్తిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదన్నారు. ఈ సందర్భంగా మరోసారి రెడ్‌బుక్‌గురించి ప్రస్తావించారు.
రెడ్ బుక్‌లో పేరున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఇప్పుడు జరుగుతున్నది ట్రయలరేనని.. మున్ముందు సినిమా ఉంటుందని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్కులో చేర్చామని పేర్కొన్నారు. రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదని తెలిపారు. గతంలో ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రతి మీటింగ్‌లో నూ దీని గురించి మాట్లాడానని తెలిపారు. ఇప్పుడు దానిని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు.
ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీతో తీర్పు ఇచ్చారని నారా లోకేష్ చెప్పారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడని, అతనిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. త్వరలోనే లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు. తాము వదిలేస్తే.. ప్రజలు బాధపడతారని, ప్రజలు తమకు ఇచ్చిన మేండేట్ ఇదేనని వెల్లడించారు.
This post was last modified on August 16, 2024 4:11 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…