వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి జోగి రమేష్ కేసుల్లో చిక్కుకున్నారు. ఆయన కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పటికే జోగిపై చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారన్న కేసు ఉండనే ఉంది. ఇప్పుడు.. ఆయనకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాలని కూడా పిలిచారు. ఈ పరిణామాలతో జోగి ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. ఒకే రోజు తన కుమారుడిని అరెస్టు చేయడం, అదే రోజు తనను విచారణకు రమ్మంటూ నోటీసులు ఇవ్వడంతో ఆయన రగిలిపోయారు. ఈ క్రమంలో ఆయన కులం కార్డును బయటకు తీశారు.
తాను ఎన్నో కష్టాలు పడి.. ఒక వెనుక బడిన సామాజిక వర్గం నుంచి అనేక ఆటుపోట్లుఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగానని చెప్పిన జోగి.. తనపై కక్షకట్టి చంద్రబాబు ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందన్నారు. అంతటితో ఆగకుండా.. ఇది గౌడ సామాజిక వర్గంపై కూటమి సర్కారు చేస్తున్నయుద్ధంగా ఆయన అభివర్ణించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి.. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. దీనిని ఆయన తన వ్యక్తిగత అంశాలకు జోడించుకుని..తనపై దాడిని కులంపై జరిగిన దాడిగా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. అయితే.. దీనికి టీడీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది.
ఇదే గౌడ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. గతంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక బాలుడు అమర్నాథ్ గౌడ్‌పై జరిగిన అమానుషాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో బాధితులకు అండగా ఉన్నారా? అని నిలదీశారు. అంతేకాదు.. బాధితులకు అండగా వచ్చిన వారిపైనా పోలీసులను ప్రయోగించి.. లాఠీ చార్జీ చేయించలేదా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత కేసుల్లో ఇరుక్కుని.. ఇప్పుడు కులం కార్డును అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు టీడీపీకి చెందిన గౌడ సామాజిక వర్గం నాయకులు కూడా జోగి వ్యవహారంపై నిప్పులు చెరుగుతున్నారు.
అప్పట్లో ఏం జరిగింది?
2022-23 మధ్య కాలంలో తెనాలికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి అక్కపై కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. దీనిని అమర్నాథ్ గౌడ్ ప్రశ్నించారు. అయితే.. అమర్నాథ్‌ను కొందరు దుండగులు అపహరించి.. పెట్రోల్ పోసి తగులపెట్టారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీనివెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలికి తీయడంలోనూ.. బాధితులకు అండగా ఉండడంలోనూ వైసీపీ సర్కారు పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలోనే జగన్ పై కూడా విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గౌడలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
This post was last modified on August 14, 2024 12:08 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…