కరణం బలరామకృష్ణమూర్తి.. సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు. టిడిపి తో ప్రస్థానం ప్రారంభించిన కరణం బలరామకృష్ణమూర్తి అంతకుముందు కాంగ్రెస్లోనూ పనిచేశారు. టిడిపిలో సుదీర్ఘకాలం అద్దంకి నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాజకీయంగా చక్రం తిప్పారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై విజయం సాధించిన బలరామకృష్ణమూర్తి తర్వాత కాలంలో వైసీపీ పంచన చేరిపోయారు.
ఈ క్రమంలోనే తన కుమారుడు కరణం వెంకటేష్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో చీరాల టికెట్ ఇప్పించుకున్నారు. అయితే కూటమి పార్టీల హవా ముందు వైసీపీ ఓడిపోయినట్టే కరణం కుమారుడు కూడా విజయం సాధించలేకపోయారు. ఇక అప్పటి నుంచి కరణం కుటుంబం పక్క చూపులు చూస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మళ్లీ పాత గుటికి వెళ్తారని టిడిపిలో చేరడమే మంచిది అని కరణం కుటుంబ భావిస్తున్నట్టు గత కొన్నాళ్లుగా చీరాలలో చర్చ జరుగుతోంది.
ముందు బలరామకృష్ణమూర్తి పార్టీలోకి తిరిగి వెళ్లి తర్వాత నెమ్మదిగా తన కుమారుడిని తీసుకొస్తారన్న చర్చ ఉంది. అందుకే ఆయన తన రిజైన్ లెటర్ ను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారని వైసీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. రేపు మాపో కరణం వెళ్ళిపోతాడంటూ స్థానికంగా కూడా నాయకులు చర్చించుకుంటున్నారు. నిజానికి చీరాలలో ప్రస్తుతం కరణం కుటుంబానికి సహకరించే నాయకులు పెద్దగా కనిపించడం లేదు. వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఆమంచి కృష్ణమోహన్ వైపు మొగ్గుచూపుతున్నారు.
దీంతో ఇంకా ఎంతో కాలం ఇక్కడ ఉండి రాజకీయాలు చేయలేమని నిర్ణయించుకున్న కరణం బలరామ కృష్ణమూర్తి టిడిపిలో చేర్చడం ద్వారా తన రాజకీయాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇది ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్న చర్చ మాత్రమే. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు కరణం వస్తానన్నా తీసుకునేది లేదన్నట్టుగానే టిడిపి వ్యవహరిస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రెండు పడవలపై కాలేసిన వారిని ఎట్టి పరిస్థితులను తీసుకోకూడదని ఆయన ఉద్దేశంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే నిజమైతే కరణం బలరామకృష్ణమూర్తి ప్రయత్నం వృధా అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయినా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేనట్టే ఇప్పుడు టిడిపిలో కూడా కరణం బలరామకృష్ణమూర్తి వ్యవహారం నడుస్తుందని, ఆయనను తీసుకున్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా కరణం వ్యవహారం కలకలం గా మారింది చివరికి ఎటు మలుపు తిరుగుతుందో ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 13, 2024 6:36 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…