వైసీపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలకు కేంద్ర బిందువుగా… ఆరోపణలు ఎదుర్కొం టున్న దివ్వెల మాధురి బిగ్ ట్విస్టు ఇచ్చారా? ఆమె అనూహ్యంగా ఆసుపత్రికి చేరడం వెనుక రీజనేంటి? పైగా వైద్యాన్నినిరాకరించడం వెనుక రీజనేంటి? అనేది ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం ఆమెను పలువురు పలాసలోని వైద్యశాలలో చేర్పించారు. తన కారును ప్రమాదానికి గురిచేసి ఆత్మహత్యకు ప్రయత్నించార నేది సమాచారం… ఆసుపత్రిలో వైద్యం నిరాకరిస్తున్న మాధురి వీడియోలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నా యి.
దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ వ్యవహారం.. గత నాలుగు రోజులుగా వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో సహజీవనం చేస్తున్న మాధురి.. దువ్వాడ సతీమణి వాణి, పిల్లల మధ్య వివాదాలు తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాలపైనా ఒకరికొకరు కేసులు పెట్టుకున్నారు. తమను వది లేసి.,. మాధురితో ఉంటున్నారనేది దువ్వాడ సతీమణి చేస్తున్న ఆరోపణ. అయితే.. తప్పేంటనేది మాధు రి ప్రశ్న. ఎన్నిక లసమయంలో తాను రెండు కోట్లు ఖర్చు చేశానని కూడా చెబుతున్నారు.
ఈ వివాదం ఇలా జరుగుతున్న క్రమంలోనే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మాధురి ప్రయాణిస్తున్న కారు.. పలాస టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో పెను ప్రమాదం చోటు చేసుకోకపోయినా.. అందులో ప్రయాణిస్తున్న మాధురికి మాత్రం బలమైన గాయా లయ్యాయి. దీంతో ఆమె పలాస ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ ఆమె వైద్యానికి నిరాకరించడం.. గమనార్హం. దీంతో ఆమె ఆత్మహత్య యత్నం చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇది ఉద్దేశ పూర్వక ప్రమాదమా..? లేక నిజంగానే ప్రమాదవశాత్తు ఘటన జరిగిందా? అనే కోణంలో వారు వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలావుంటే.. దువ్వాడ శ్రీనివాస్-మాధురి వ్యవహారాన్ని వైసీపీ అధినేత జగన్ సమర్థించిన విషయం తెలిసిందే. దీనిని రాజకీయ కోణంలో చూసిన జగన్.. పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని, టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడు దువ్వాడను రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని, పోలీసులు లేనిపోని కేసులు నమోదు చేస్తున్నారని జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. లేఖ విడుదల చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్‌కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని…
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…