వైసీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో అయినా..ఉద్యోగాల్లో అయినా.. ఇవన్నీ కామనే. తమకు అవకాశం ఉంటే ఉంటారు. లేకపోతే వెళ్తారు. కానీ, ఆళ్ల విషయానికి వస్తే.. ఇతర నేతలకు.. ఈయనకు తేడా ఉంది. ప్రధానంగా మూడు కీలక లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి విధేయత, రెండు వివాదాలకు దూరం, మూడు జగన్‌పై అపార నమ్మకం, విశ్వాసం, నాలుగు చిన్న వయసు.
ఇన్ని మంచి లక్షణాలు ఉండి కూడా ఆళ్ల నాని ఎందుకు దూరమయ్యారు? అసలు రాజకీయాలను వదిలేసేంతగా ఆయన నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి ఆయనను మంత్రి వర్గం నుంచి హఠాత్తుగా తప్పించినప్పుడు కూడా పెద్దగా బాధపడలేదు. టికెట్ విషయంలో దోబూచులాడినప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఉరుములేని పిడుగు మాదిరిగా రాజీనామా చేశారు.
దీనికి కారణం.. జగన్! ఔను.. అక్షరాలా నిజం. ఆయన ఉదాసీనత.. ఆళ్ల నాని వంటి సౌమ్యులను నిలబె ట్టుకోవాలన్న తాపత్రయంలేక పోవడమే కారణం. కొన్నాళ్ల కిందటే ఆళ్ల నాని పార్టీ అధిష్టానానికి హింట్ ఇచ్చారు. జిల్లాలో పరిస్థితులు బాగోలేదని.. నాయకులు వెళ్లిపోతున్నారని.. ఏం చేయాలో చెప్పాలని ఆయన కోరారు. దానిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే పలువురు నాయకులు వెళ్లిపోయారు. నిజానికి వారిని ఆళ్లనాని ఊరడించారు.
అయినప్పటికీ.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ఇతరత్రా అంశాలు జోరుగా పనిచేశాయి. వీటిని కూడా రెండో సారి ఆళ్ల నాని పార్టీకి వివరించారు. అప్పుడు కూడా పార్టీ ఆయనను పట్టించుకోలేదు. కానీ, రోజు రోజుకు పార్టీ వీక్ అయిపోతోంది. తన మాటను వినలేని పరిస్థితి వచ్చేసింది. దీంతో పార్టీ ఎలానూ పట్టించుకోన ప్పుడు.. తాను మాత్రం చేసేది ఏముందన్న వాదనతోనే ఆళ్ల ఏకంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఈ సమస్య ఆళ్ల ఒక్కరికే కాదు.. పార్టీలో కనీసం 20 నుంచి 30 మంది నాయకులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికైనా జగన్ దీనిని ఒక పాఠంగా తీసుకుంటారో లేదో చూడాలి.
This post was last modified on August 11, 2024 7:24 am
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…