జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల దూకుడుకు ఆయన అష్టదిగ్భంధం వేశారు. సహజంగానే పార్టీ అధికారంలోకి వచ్చాక.. అది ఏ పార్టీ అయినా.. కార్యకర్తలు, నాయకుల దూకుడు ఎక్కువగానే ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు కాకపోయినా.. వచ్చే నాలుగేళ్లలో కనిపిస్తుంది. రాక రాక వచ్చిన అధికారం, పదేళ్లకుపైగా నిరీక్షణం వంటి కారణాల నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చింది.
దీంతో ఇప్పుడు వేచి చూస్తున్నా.. రాబోయే రోజుల్లో వారు కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది. తమ పార్టీ మద్దతు లేకపోతే టీడీపీ గెలిచేది కాదని, తమ పార్టీ దన్ను లేకపోతే.. టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదన్న వాదన ఇప్పటికే క్షేత్రస్థాయిలో చూచాయగా వినిపిస్తోంది. ఇది సహజంగానే జనసేన దూకుడుకు అద్దం పడుతుంది. అదేసమయంలో నాయకులు కట్టుదాటేందుకు కూడా ఒక ఇంధనంగా ఉపయోగపడుతుంది . దీనివల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.
దీనిని ఇప్పడు గ్రహించిన పవన్ కల్యాణ్.. నర్మగర్భంగా పార్టీ నాయకులను అదుపు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకే ఆయన తనను తాను ముందుగా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తున్నానని చెబుతున్నారు. చంద్రబాబు నుంచి నేర్చుకునే దశలో ఉన్నారని అంటున్నారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో మరింత విడమరిచి మరీ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి తాను నేర్చుకునేది ఎక్కువగా ఉంటుందన్నారు.
అంటే.. తానే నేరుగా చంద్రబాబు చెప్పింది వినేందుకు ఉత్సాహంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. కాబట్టి క్షేత్రస్థాయిలో నాయకులు కూడా టీడీపీకి అనుకూలంగానే ఉండాలన్న బలమైన సంకేతాలను పంపించారు. దీని వల్ల నాయకులు టీడీపీకి దూరంగా ఉండడంతోపాటు.. ఆ పార్టీపై విమర్శలు చేసి.. తద్వారా రెండు పార్టీల మధ్య దూరం పెంచకుండా ఉండేందుకు పవన్ తనవంతు ప్రయత్నం చేశారు. దీనివల్ల పార్టీల మధ్య విభేదాలు రాకుండా ఉండడంతోపాటు.. తనే చంద్రబాబు శిష్యుడిగా మారుతున్న నేపథ్యంలో మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పకనే చెప్పారు. మరి జనసేన నాయకులు, కార్యకర్తలు దీనిని ఏమేరకు పాజిటివ్‌గా తీసుకుంటారనేది చూడాలి.
This post was last modified on August 11, 2024 7:19 am
ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం…
ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…
ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…
దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…
నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా…