“దేనినైనా రాజకీయంగా ఆలోచించే ముందు అది ప్రజాహితమా? నాయకుల అభిమతమా? అన్నది ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఆలోచించుకోవాలి!” – దాదాపు రెండు దశాబ్దాల కిందట ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి పార్లమెంటు వేదికగా చెప్పిన మాట. ఫొక్రాన్ అణు పరీక్షలు చేసిన సమయంలో ప్రతిపక్షాల నుంచి ఎలుగెత్తిన విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆయన చెప్పిన మాట.. నేటికీ సజీవం. ప్రతి విషయాన్నీ పొలిటికల్ అద్దంలో చూస్తున్న పరిస్థితి రాష్ట్రాల నుంచి కేంద్రం వరకు ఎగబాకింది!
కేరళలో వయనాడ్ ఉత్పాతం.. జాతీయంగా కంటే కూడా అంతర్జాతీయంగా మీడియా ఘోషించిన తీరు అక్కడ సంభవించిన వరదల బీభత్సాన్ని అక్షరీకృతం చేసి.. పాలకుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టాయి. ఇది ఊహించని విపత్తుగా ఇటు కేరళ, అటు కేంద్రం చెబుతున్నా.. వాస్తవాలు నిగ్గు తేల్చడంలో మనకన్నా.. పొరుగు దేశాల మీడియా బాగా పనిచేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన అనేక మంది స్వతంత్ర రిపోర్టర్లు కూడా అసలు ఏం జరిగిందో చెప్పారు.
ఇక, కేరళ ప్రభుత్వం పరంగా.. చేయాల్సింది చేశారు. ఈ ఘటనలో సుమారు 1000 మందికిపైగా మృతి చెందారన్నది అంతర్జాతీయ మీడియా చెప్పిన మాట. దీనికి కొంత అటు ఇటుగా.. స్థానిక మీడియా కూడా తేల్చింది. కానీ, కేంద్రం లెక్కలు వేరే ఉన్నాయి. అవే రాజకీయ గణాంకాలు. అక్కడ ఉన్న ఇండియా కూటమి ప్రభుత్వం కావడంతో ఈ లెక్కలు సదరు నేతల కనుసన్నల్లో వచ్చిన కరోనా లెక్కలను మించి పోయాయి. పైగా.. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న పార్లమెంటు సభ్యుల ఘోషను పట్టించుకున్న నాధుడు కూడా లేకపోవడం గమనార్హం.
జాతీయ విపత్తు అంటే.. మూడుకు మించిన రాష్ట్రాల్లో ఒకే తరహా పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రకటిస్తారన్న ఒక్క ప్రకటనతో మోడీ సర్కారు వయనాడ్ విపత్తుకు మంగళం పాడింది. ఇప్పటి వరకు సాయం చేస్తామన్నారే కానీ.. రూపాయి విదిలించింది లేకపోయిందని సీఎం పినరయి విజయన్ చేసిన విమర్శలో సహేతుకత స్పష్టంగా ఉంది. అయినా.. మోడీ సర్కారుకు చీమ కుట్టలేదు. ఈ లోగా.. రాజ్యసభలో రేగిన జయా బచ్చన్ వర్సెస్ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వివాదంతో వయనాడ్ గుర్తుకు వచ్చింది.
తాజాగా శనివారం .. ప్రధాని మోడీ వయనాడ్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్వీయ నేత్రాలతో ప్రకృతి ఉత్పాతాన్ని ఆయన పరిశీలించేందుకు వస్తున్నారు. మంచిదే. కానీ, చూసి ఏం చేస్తారు? అన్నదే ఇప్పుడు ప్రశ్న. కనీసంలో కనీసం తమకు 3 వేల కోట్లయినా ఇవ్వాలన్న విజయన్ అభ్యర్థనపై ఇప్పటికీ మౌనంగా ఉన్నారు. మరిదీనికి మొగ్గు చూపుతారా? లేక యధాలాపంగా యాభైయ్యో.. వంద కోట్లో ఇచ్చి.. కేంద్ర బృందాలు పరిశీలించాక.. అంటూ చేతులు దులుపుకొంటారా చూడాలి.
This post was last modified on August 10, 2024 1:31 pm
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…