రాష్ట్రంలో రెండు నెలలుగా మారణహోమం సాగుతోందని.. అరాచక పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతూనే ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్య లకు బాధ్యులైన వారిపై నమోదు చేస్తున్న కేసులకు తోడు వారిని ప్రోత్సహిస్తున్న వారిపైనా కేసులు పెట్టా లన్నారు. అదేవిధంగా వీరికి మద్దతుగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను కూడా వదిలి పెట్టుకుండా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు.
తాజాగా నంద్యాల జిల్లాలో పర్యటించిన జగన్.. ఇక్కడి మహానందిలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ నాయకుడు పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. గత శనివారం సుబ్బారాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంట్లో నుంచి బయటకు లాగి మరీ.. రాళ్లతో మోది చంపేశారు. ఈ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు మాసాలుగా దారుణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు కొనసాగుతున్నా ఎవరూ పట్టనట్టుగానే ఉన్నారని తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలంటే.. హత్యలు, దాడులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లపైనా కేసులు పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రజలకుమంచి చేయాలన్న సంకల్పం చంద్రబాబు లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని దుయ్య బట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారన్న జగన్.,. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు.
ఆయా హామీలపై ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తాము ప్రశ్నిస్తామన్న ఉద్దేశంతోనే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తూ.. రాష్ట్రంలో భయోత్పాతం సృస్టిస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలు కూడా భయపడి ఏమీ ప్రశ్నించరన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచి, కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు రెచ్చిపోతున్నారని, ఆయా పరిణామాలపై హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని జగన్ స్పస్టం చేశారు.
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…