ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత భేటీ అయ్యారు. అమరావతి సచివాలయంలోని రెండో బ్లాక్‌లో మంత్రి అనిత ఛాంబర్‌లో కలిసి కొద్దిసేపు చర్చించారు. వారి సంభాషణల్లో వివేకా దారుణ హత్యకు సంబంధించిన విషయాలే వినిపించా యి. డీజీపీ కార్యాలయంలో ఒకసారికలవాలంటూ సునీతకు హోం మంత్రి అనిత సూచించారు. తాను కూడా డీజీపీతో మాట్లాడానని అన్నారు. మొత్తంగా 20 నిమిషాలకు పైగానే వీరి మధ్య చర్చలు సాగాయి.
అయితే.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిలను గెలిపించాలని, న్యాయాన్ని గెలిపించాలని సునీత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పాదయాత్రగా వెళ్లి ప్రతి ఇంట్లో ని ఓటర్లను కూడా కలిశారు. తన తండ్రి దారుణ హత్య ఉదంతాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. అయితే.. ఎక్కడా ఆమెకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె రాజకీయంగా వైసీపీ తన తండ్రి కేసును తొక్కి పెడుతోందని భావించిన ఆమె విభేదించారు.
తాజా ఎన్నిక్లలో వైసీపీకి వ్యతిరేకింగా సునీత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తమ ప్రాణాలకు కూడా ము ప్పు ఉందని పేర్కొన్నారు. మొత్తానికి అన్నపై కసి తీర్చుకున్న సునీత.. ఎన్నికల ప్రచారం తర్వాత సుమారు రెండు మాసాలకు ఇలా ప్రత్యక్షం కావడం గమనార్హం. అది కూడా రాష్ట్ర హోం శాఖ మంత్రిని కలుసుకోవడం.. తన తండ్రి దారుణ హత్యకు సంబంధించిన వ్యవహారాలపైనే చర్చించడం గమనార్హం. ఎన్నికలకు ముందు తర్వాతకూడా.. వైఎస్ వివేకాహత్య కేసు రాజకీయంగా పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే.
This post was last modified on August 7, 2024 11:30 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…