Political News

కార్యకర్తల మీద జగన్ ఫీలింగ్ ఇదా?

గత పర్యాయం ఏకంగా 151 సీట్లతో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందుకు ప్రధాన కారణాల్లో కార్యకర్తల కృషి ఒకటి. అదే పార్టీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిందన్నా దాని వెనుక కార్యకర్తలు ఉన్నారని చెప్పుకోవాలి.

అంటే వాళ్లు పనిగట్టుకుని ఓడించారు అని కాదు. కార్యకర్తలను వైసీపీ సరిగా పట్టించుకోవడంతో గత ఎన్నికలకు ముందులా వాళ్లు కసిగా పని చేయలేదని.. ఈ పార్టీతో ఒరిగేది ఏముంది అనే నైరాశ్యం వాళ్లను ఆవహించి సైలెంటుగా ఉండిపోయారనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ హయాంలో పెద్ద నాయకులు బాగుపడ్డారు, తప్ప.. కింది స్థాయి కార్యకర్తలు దారుణంగా దెబ్బ తిన్నారని.. గ్రామీణ స్థాయిలో కాంట్రాక్టులు కూడా లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైందనే చర్చ జరిగింది.

కార్యకర్తలను పట్టించుకోలేదనే చెడ్డ పేరును జగన్ మూటగట్టుకున్నారు. తనను ఎంతో అభిమానించే కార్యకర్తలను గత ఐదేళ్లలో ఎక్కడా కలిసే ప్రయత్నం కూడా చేయకపోవడం, వారికి ఏ రకంగానూ అండగా నిలవకపోవడం వ్యతిరేకతను పెంచింది. అసలు ఆయనకు కార్యకర్తల పట్ల ఆయన ఫీలింగ్ ఏంటి అన్నది వైసీపీ మాజీ నేత, ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే టైంలో వివిధ ఫైళ్లు పట్టుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు సంతకాల కోసం జగన్‌ను కలిసేవారని.. ఆ టైంలో ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ బిల్స్ కూడా తెచ్చేవారని.. కానీ వాటి విషయంలో జగన్ విముఖత ప్రదర్శించేవారని వసంత వెల్లడించారు.

ఓ సందర్భంలో 30 మంది ఎమ్మెల్యేలు చుట్టూ ఉండగా.. కార్యకర్తల గురించి ఆయనన్న మాట తనను షాక్ గురిచేసిందన్నారు. కార్యకర్తలు దొంగ బిల్లులు పెడతారని చెబుతూ.. అందుకే కదా ఈ ఫైల్స్ తెస్తారు అని ప్రశ్నించిన జగన్ తనకు ఇలాంటివి ఇష్టం ఉండవంటూ వాటిని తిరస్కరించిన విషయాన్ని వసంత గుర్తు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. కార్యకర్తల పట్ల జగన్ ఫీలింగ్ ఇదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

This post was last modified on August 7, 2024 11:18 pm

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

31 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

40 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago