Political News

పాద‌యాత్ర.. మ‌ళ్లీ సై అంటున్న ష‌ర్మిల‌!

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల పాదయాత్రకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు కూడా కాకుండానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవ‌రూ ఊహించ‌రు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు కాకుండా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని, ముఖ్యంగా తన హవా చలాయించాలంటే కచ్చితంగా తన ముద్రపడాలంటే ప్రజల్లో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర 2004 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ప్రారంభించారు. అలాగే భారత్ జూడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కూడా రెండేళ్ల ముందే యాత్ర ప్రారంభించి రెండు విడతలుగా పూర్తి చేశారు. ఇప్పుడు ఏపీలో 2.8% మాత్రమే ఉన్న ఓటు బ్యాంకును పుంజుకునేలా చేయడంతో పాటు నాయకులను బలోపేతం చేయాల్సిన అవసరం షర్మిలకు ఏర్పడింది. ఇప్పటినుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తాను పుంజుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.

ముఖ్యంగా వైసిపి నుంచి బలమైన నాయకులు బయటకు రావాలన్నా, తన పార్టీలో చేరాలన్నా ముందు ప్రజల్లో తన విశ్వస‌నీయ‌త‌ను పెంచుకోవడంతోపాటు ప్రజల్లో బలోపేతం కావాలని వ్యూహాన్ని ఆమె రచించిన‌ట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి షర్మిల సమాచారం అందించినట్లు రఘువీరారెడ్డి వంటి నాయకులు చెప్తున్నారు. అంటే ఇది అధికారికంగా బయటికి రాకపోయినా అంతర్గ‌త‌ చర్చల్లో మాత్రం షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయాన్ని చాలామంది నాయకులు ఒప్పుకుంటున్నారు.

మొత్తంగా మూడు విడతల్లో చేయాలనే ఉద్దేశంతో షర్మిలో ఉన్నారని సమాచారం. ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ అలాగే కోస్తా జిల్లాల్లో మూడు విడతలుగా పాదయాత్ర చేసి సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో ఉండటం ద్వారా పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైయస్ వారసత్వాన్ని కూడా తాను అందిపుచ్చుకునేలా అడుగులు వేస్తున్నారనేది మీరు మాట.

దీనికి పార్టీ అధిష్టానం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని వస్తే కనుక షర్మిల వచ్చే ఏడాది ప్రారంభం నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతుండడం గమనార్హం. అయితే ఇది అధికారికంగా కాదు. కానీ అంతర్గత చర్చల్లో మాత్రం జోరుగానే ప్రచారం జరుగుతోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Share

Recent Posts

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

2 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

3 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

3 hours ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

3 hours ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

4 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

4 hours ago