వైసిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి బలవుతున్నారా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కుటుంబంలోని నలుగురికి వైసీపీ టికెట్ ఇచ్చింది. అయినా కూటమి తుఫాన్ నేపథ్యంలో అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో బొత్స సత్యనారాయణ కు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా పార్టీలో ఎన్నికయ్యారు.
కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని తీసుకుంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాకు చెందిన నాయకులు, అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు వీరందరూ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. పైగా విశాఖపట్నంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ను కూటమి నాయకులు దాదాపు హస్తగతం చేసుకున్నారు. ఇప్పటికే 21 మంది నాయకులు టిడిపి వైపు వచ్చేసారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
దీనికి సంబంధించి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగిలిన వారు కూడా వచ్చేస్తారని ఫలితంగా విశాఖపట్నం కార్పొరేషన్ మొత్తం కూటమి వశం అవుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని వైసీపీ నాయకులు కనిపించడం లేదు. ఈ క్రమంలో బొత్సను నిలబెట్టినా ఆయన గెలిచే పరిస్థితి లేదని కేవలం ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్టుగా ఆయనను నిలబెట్టినట్టే అవుతుందని తూర్పు కాపుల్లో చర్చ జరుగుతోంది.
తమ నాయకుడిని జగన్ బలి చేస్తున్నారని తూర్పు నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి ఏదైనా పదవి ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులలో వైసీపీకి సాధ్యమయ్యే అవకాశం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఉండటం, శాసన మండలిలో బలంగా ఉన్నప్పటికీ కొందరు ముఖ్య నేతలు దూరంగా ఉండటంతో వైసిపికి ఎటూ పాలు పోని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో అనవసరంగా బొత్సను బద్నాం చేస్తున్నారని తూర్పు కాపుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండడం గమనార్హం.
This post was last modified on August 4, 2024 7:30 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…