Movie News

కీర్తి గ్లామర్.. ఇది నెక్స్ట్ లెవెల్

రోమ్‌కు వెళ్తే రోమన్ లాగా ఉండాలి అని ఒక సామెత. అలాగే సినీ పరిశ్రమలో చేసే సినిమాలను బట్టి అప్పీయరెన్స్ ఉండాల్సిందే. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన మలయాళ భామ కీర్తి సురేష్ ఒకప్పుడు ట్రెడిషనల్ రోల్సే చేసేది. అందుకు తగ్గట్లే సంప్రదాయబద్ధంగా కనిపించేది.

తన పాత్రల్లో ఎప్పుడైనా కొంచెం గ్లామర్ టచ్ ఉన్నా.. అది హద్దులు దాటేది కాదు. క్లీవేజ్ షోలకు ఆమె పూర్తిగా దూరంగా ఉండేది. కానీ ఈ మధ్య కీర్తి మేకోవర్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. గ్లామర్ హీరోయిన్లలో ఎవ్వరికీ తాను తీసిపోనని చాటే ప్రయత్నం చేస్తోంది. మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’లోనే ఆమె మేకోవర్ చూశాం.

ఇప్పుడు బాలీవుడ్లో వరుణ్ ధావన్ సరసన సినిమా చేస్తుండడంతో అక్కడి స్టైల్‌కు తగ్గట్లుగా సూపర్ హాట్‌గా తయారవుతోంది కీర్తి. ఈ మధ్య కీర్తి ఏదైనా ఈవెంట్‌కు హాజరైనా, ఫొటోె షూట్ చేసినా అందులో గ్లామర్ డోస్ బాగా ఉంటోంది. మొన్న ‘రఘు తాత’ అనే సినిమాకు సంబంధించిన ఈవెంట్లో కీర్తి అందాల ఆరబోత చూసి అభిమానులు అవాక్కయ్యారు.

ఐతే ఇప్పుడు ‘ఫిలిం ఫేర్’ అవార్డుల కోసం కీర్తి తయారై వచ్చిన తీరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అల్ట్రా మోడర్న్ లుక్‌లోకి మారిన ఆమె.. మునుపెన్నడూ లేని స్థాయిలో ఆమె క్లీవేజ్ షో చేసింది. మనం చూస్తున్నది నిజంగా కీర్తినేనా అని ఆశ్చర్యపోతూ కుర్రాళ్లు ఈ ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఒక రెండు మూడేళ్లు వెనక్కి వెళ్తే.. కీర్తిని ఇలాంటి లుక్‌లో చూస్తామన్న ఊహ కూడా ఎవరికీ ఉండేది కాదు.

కెరీర్ ముందుకు సాగేకొద్దీ ఎలాంటి హీరోయిన్ అయినా గ్లామర్ బావిలోకి దిగాల్సిందే అని చెప్పడానికి కీర్తి తాజా రుజువు. ప్రస్తుతం కీర్తి తెలుగులో కొత్తగా ఏ సినిమా ఒప్పుకోలేదు. తమిళంలో మాత్రం ‘రివాల్వర్ రీటా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. అది తెలుగులోనూ విడుదల కానుంది.

This post was last modified on August 4, 2024 6:17 pm

Share

Recent Posts

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

1 hour ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

1 hour ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

4 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

4 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

6 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

7 hours ago