Political News

అంగ‌ళ్ల దాడికి ఏడాది… బాబు ఏం చేస్తారో?

చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడికి ఏడాది కాలం పూర్తయింది. గత ఏడాది ఆగస్టు 4వ తారీఖున చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గంలోకి రాకుండా అప్పటి వైసిపి కార్యకర్తలు నాయకులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. అయితే పోలీసులు ముందుగానే ఆయనను అంగళ్ళు ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా చంద్రబాబు మాత్రం తన సొంత జిల్లాలో తన పర్యటనకు అడ్డు పెడతారా అంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.

ఇది వివాదానికి దారితీసింది. అప్పట్లో పోలీసులపై కూడా దాడులు జరిగాయి. దీనిలో టిడిపి నాయకులు వైసిపి నాయకులు పరస్పరం రాళ్ల రువ్వుకోవడం చివరకు పోలీస్ వాహనాల ధ్వంసం కూడా చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో టిడిపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 21 మందిపై కేసులు కూడా పెట్టారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన నలుగురైదుగురుపై మాత్రమే కేసులు నమోదు చేశారు. అప్పట్లో తీవ్ర వివాదానికి, రాజకీయంగా విమర్శలకు దారి తీసిన అంగళ్లు ఘటన ఎన్నికల సమయంలోనూ ప్రచారాస్త్రంగా మారింది.

పోలీసులు ఏకపక్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని, మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబును నిలువరించాలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఘటన జరిగి ఏడాది అయినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మారి చంద్రబాబు నేతృత్వంలోని ప్ర‌బుత్వం వచ్చినా అంగళ్లు కేసు కు సంబంధించి ఇప్పటివరకు చార్జిషీట్లు నమోదు చేయకపోవడం కీలకమైన నిందితుల్ని అరెస్టు చేయకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది.

మరోవైపు తమపై అన్యాయంగా కేసులు పెట్టారని, తమను అక్రమంగా ఇరికించారని చెబుతున్న టిడిపి నాయకులకు ఇప్పటివరకు ఎలాంటి ఊర‌ట‌ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో అంగళ్లు కేసుకు సంబంధించి చంద్రబాబు సత్వరమే నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. అప్పటి ఘటనలో మాజీ మంత్రి ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందని ఆయన పేరును కూడా కేసులో నమోదు చేయాలని టిడిపి నాయకులు కోరుతున్నారు.

అదేవిధంగా వైసీపీకి చెందిన మరికొందరు ముఖ్య నాయకులు కూడా ఈ ఘటంలో బాధ్యులేనని వారిని పోలీసులు చూసి చూడనట్టు వదిలేసారని అంటున్నారు. కాబట్టి వారి పైన కేసులు పెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన ఈ కేసును పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికైనా ఈ కేసును పరిష్కరించే ప్రయత్నం చేస్తారా? తమ్ముళ్లకు ఊర‌ట‌ ఇస్తారా? అనేది చూడాలి.

This post was last modified on August 4, 2024 1:28 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

58 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago