Political News

బాబు లో ఏంత మార్పు!

టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కొన్ని కొన్ని విష‌యాల్లో చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రి స్తున్నారు. గ‌తానికి ఇప్ప‌టికీ.. పాల‌న విష‌యంలోనూ, రాజ‌కీయాల విష‌యంలోనూ ఆయ‌న‌లో చాలా మార్పు క‌నిపించింది. గ‌తంలో ఎలా వ్య‌వ‌హ‌రించినా.. అప్ప‌టి సంగ‌తి వేరు. కానీ, ఇప్పుడు ఓడిపోయిన ప్పటికీ వైసీపీ బ‌లంగా ఉండ‌డం.. 40 శాతం ఓటు బ్యాంకుతో క్షేత్ర‌స్థాయిలో నిల‌దొక్కుకున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనిని త‌క్కువ‌గా అంచ‌నా వేసేందుకు వీల్లేదు.

అందుకే చంద్ర‌బాబుకూడా చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు, వ్య‌క్తిగ‌త రాజ‌కీయాల‌కు కూడా ప్రాధాన్యం త‌గ్గించి.. త‌న మిత్ర ప‌క్షాలు ఎలా అయితే, న‌డు స్తున్నాయో.. అలానే చంద్ర‌బాబు కూడా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో చిన్న చిన్న విష‌యాల‌ను ఆయ‌న ప‌క్క‌న పెట్టారు. త‌న పాదాల‌కు న‌మస్కారాలు చేయొద్ద‌ని చెప్పారు. దీంతో త‌మ్ముళ్లు కొంత మేర‌కు వెన‌క్కి త‌గ్గారు. ఇక‌, కొన్నికొన్ని రాజ‌కీయ విష‌యాల్లోనూ చంద్ర‌బాబు నిర్ణ‌యాలు ఆశ్చ‌ర్యంగా ఉన్నాయి.

తాజాగా సుప్రీంకోర్టు ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. స‌హ‌జంగా ఇలాంటి తీర్పులు ఇచ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు త‌న ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఏం జ‌రిగినా.. అది నావ‌ల్లే జ‌రిగింద‌ని.. నేను ముందే చేశాన‌ని చెప్పుకోవ‌డం ఆయ‌న కు స‌హ‌జంగా వ‌చ్చిన రాజ‌కీయం. అయితే.. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చిన త‌ర్వాత‌.. ఈ సాహ‌సం చంద్ర‌బాబు చేయ‌లేక పోయారు. నిజానికి ఆయ‌న ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలం.

ఇదే విష‌యాన్ని మంద కృష్ణ మాదిగ కూడా చెప్పారు. చంద్ర‌బాబు ముందుగానే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు ఓకే చెప్పార‌ని అన్నారు. అలాంటిది చంద్ర‌బాబు చూచాయ‌గా స్పందించారే త‌ప్ప‌.. ఎక్క‌డా కూడా త‌న క్రెడిట్‌ను ప్ర‌స్తావించ‌లేక‌పోయారు. దీనికి కార‌ణం.. మోడీనేన‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక స్టాండ్ తీసుకోలేదు. దీనిని రాజ‌కీయంగా మున్ముందు ఎలా వాడుకోవాల‌నే విష‌యంలో ఆలోచ‌న‌లో ప‌డింది.

ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అదే ఫార్ములాతో ఉన్నారు. బీజేపీ అనుస‌రించే వ్యూహాన్ని బ‌ట్టి స్పందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. సో.. కీల‌క‌మైన విష‌యంలో చంద్ర‌బాబు ఇలా మార‌డం త‌మ్ముళ్ల‌కు సైతం ఆశ్చ‌ర్యంగానే ఉంది.

This post was last modified on August 4, 2024 11:45 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

కంగువ సౌండ్‌పై విమ‌ర్శ‌లు.. దేవి ఏమ‌న్నాడంటే?

సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ…

8 hours ago

తమన్ భావోద్వేగం… ఆలోచించాల్సిన ఉత్పాతం

సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్…

9 hours ago

రావిపూడి చెప్పిన స్క్రీన్ ప్లే పాఠం

ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర…

9 hours ago

శంకర్ కూతురికీ అదే ఫలితం దక్కింది

ఇండియన్ స్పిల్బర్గ్ గా అభిమానులు పిలుచుకునే దర్శకుడు శంకర్ కొన్నేళ్లుగా తన ముద్ర వేయలేకపోవడం చూస్తున్నాం. 2.0కి ప్రశంసలు వచ్చాయి…

10 hours ago

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భార‌త సైన్యం మృతి…

దాదాపు రెండు సంవ‌త్స‌రాల‌కు పైగానే జ‌రుగుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్ర‌పంచ‌శాంతిని ప్ర‌శ్నార్థ‌కంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ…

10 hours ago

ఈ రోజు అనిల్ లేకపోతే మేము లేము…

ఒక‌ప్పుడు నిల‌క‌డ‌గా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర‌ నిర్మాత దిల్ రాజు.. గ‌త కొన్నేళ్లుగా స‌రైన విజ‌యాలు లేక ఇబ్బంది…

11 hours ago