వైసీపీ అధికారంలో ఉండగా.. చేస్తానని చెప్పిన వాటిలో రచ్చబండ
కార్యక్రమం కీలకమైంది. సీఎంగా ఉన్న జగన్.. అప్పట్లో ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు వినాలని అనుకున్నారు. ఈ క్రమంలో నలుగురు కీలక నాయకులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి.. కార్యక్రమానికి రూపకల్పన చేసే బాధ్యతలను కూడా అప్పగించారు. 2009లో ఇదే కార్యక్రమానికి బయలు దేరిన అప్పటి సీఎం వైఎస్ దురదృష్టవ శాత్తు మరణించారు. దీంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో తన తండ్రి ప్రారంభించిన రచ్చ బండకార్యక్రమాన్ని తాను కొనసాగించాలని జగన్ భావిం చారు. కానీ, ఐదేళ్లలో అనుకున్నారే తప్ప.. చేయలేదు. అంతా బాగానే ఉందని.. ఇక, రచ్చబండతో పనే లేదని అనుకున్నారు. కానీ, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రజాదర్బార్ పేరుతో ఇదే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం కానీ, ఇతర మంత్రులు కానీ.. వేరే ప్రాంతాలకు వెళ్లకుండా .. పార్టీ కార్యాలయాలనే ప్రజాదర్భార్‌లుగా మార్చేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. ఎంతగా అంటూ.. గత వారం రోజుల్లో మంగళ గిరి వీధులు కిక్కిరిసి పోయేంతగా! అవును. నిజమే. ఇటు టీడీపీ కార్యాలయంలోనూ.. అటు జనసేన కార్యా లయంలోనూ, మరోవైపు.. నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్.. ఉండవల్లిలోనూ.. ప్రజలు కిక్కిరిసి పోతున్నారు. ఊహించని విధంగా జనాలు వస్తున్నారు. వీరి కోసం.. పార్టీ కార్యాలయంలో మూడు వరుసల క్యూలైన్లను ఏర్పాటు చేశారంటే.. ప్రజలు ఎలా తరలి వస్తున్నారో అంచనా వేయొచ్చు.
ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలనే ప్రస్తావించవచ్చు. కానీ, వారికి కావాల్సింది అదే కాబట్టి.. చంద్రబాబు నుంచి ఇతర మంత్రుల వరకు కూడా ప్రజాదర్బార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరిస్తున్నారు దీంతో దశాబ్దాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయి. ఈ పరిణామాలను చూస్తున్న వైసీపీ.. అయ్యో.. మనం కూడా అప్పట్లో ఈ కార్యక్రమం నిర్వహించి ఉంటే బాగుండేదని అనుకోవడం గమనార్హం. కానీ, అప్పట్లో చేసిన నిర్లక్ష్యం కారణంగా పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
This post was last modified on %s = human-readable time difference 11:45 am
దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…