వైసీపీ పాలనలో జగన్ తన అనుయాయులకు, అనుచరులకు, తన మనుషులకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతిని జగన్ నియమించారు. లక్ష్మీ పార్వతి కన్నా అర్హులు ఎందరో ఉన్నప్పటికీ కేవలం తమ పార్టీ నేత కాబట్టే ఆమెకు పదవి కట్టబెట్టారని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీ లక్ష్మీపార్వతికి ఇచ్చిన గౌరవ ఆచార్యురాలు హోదాను ఉపసంహరించుకున్నట్లుగా యూనివర్సిటీ ప్రకటించింది.
ఈ ప్రకారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్ కిషోర్ బాబు ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీపార్వతికి యూనివర్సిటీ నుండి వేతనం చెల్లించలేదని ఆయన వెల్లడించారు. ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా విధులు నిర్వహించిన సమయంలో కూడా యూనివర్సిటీ పరిశోధికులకు గైడ్ గా విధులు నిర్వహించారు.
అయితే, తాజాగా ఆ విధుల నుంచి కూడా లక్ష్మీ పార్వతిని తప్పించినట్లుగా కిషోర్ చెప్పారు. ఆమె దగ్గర మార్గదర్శకం కోసం చేరిన రీసెర్చ్ స్కాలర్స్ ను మరో ఆచార్యునికి బదిలీ చేయాలని ఆదేశించినట్లుగా వెల్లడించారు. ఏదేమైనా జగన్ హయాంలో అప్పణంగా పదవులు పొందిన లక్ష్మీ పార్వతి వంటి నేతలపై చంద్రబాబు తన మార్కు నిర్ణయాలతో షాకిస్తున్న వైనం చర్చనీయాంశమైంది.
This post was last modified on August 2, 2024 2:22 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…