గత కొన్నాళ్లుగా వైసీపీ అధినేత జగన్ వ్యవహారం కాంగ్రెస్ కూటమి పక్షాలైన ఇండియా
లో చర్చకు వస్తోంది. డిల్లీలో ధర్నా చేసిన సమయంలో జగన్.. కొందరు ఇండియా కూటమి పార్టీల నాయకులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జార్ఖండ్‌కు చెందిన జేఎంఎం పార్టీ నాయకులు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహా బిహార్‌లోని ఇండియా కూటమి పార్టీ ఆర్జేడీ నేతలు కూడా మద్దతు పలికారు. అయితే.. కాంగ్రెస్‌కు చెందిన వారు ఎవరూ రాలేదు. అయితే.. కాంగ్రెస్ చెప్పకుండానే వీరు వచ్చారా? అనేది డౌటు.
ఒకవేళ చెప్పకపోయినా వచ్చారంటే జగన్‌పై వారికి ఉన్న సానుభూతి కావొచ్చు. లేదామున్ముందు తమకు ఉపయోగ పడతాడ నే అభిప్రాయం కావొచ్చు. గతంలో ఎంపీగా కూడా చేసిన జగన్‌తో ఉన్న స్నేహ సంబంధాలు కూడా అయి ఉంటాయి. ఎలా చూసుకున్నా.. జగన్‌కు వారి నుంచి ఆశించిన మేరకు మద్దతు లభించింది. అయితే.. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చింది. ఇండియా కూటమికి అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట కూడా మరింత మద్దతు అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు డీఎంకే ఎంపీ తిరుమావళన్, ఎస్పీ అధినేత అఖిలేష్, ఆర్జేడీ నేతలు కూడా.. జగన్‌ను కూటమిలోకి ఆహ్వానించాలన్న ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు.
ఈ విషయం గత వారం రోజులుగా జాతీయ రాజకీయాల్లో నానుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ చీఫ్.. మల్లికార్జున ఖర్గే తోనూ కొందరు నాయకులు ఇదే విషయంపై చర్చించారు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. విషయంపై మాత్రం అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశంలో జగన్ వ్యవహారంపై చర్చ జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇండియా కూటమిలోకి వైసీపీని ఆహ్వానించే అంశంపై చర్చించనున్నట్టు తెలిసింది.
అయితే.. జగన్ నేరుగా ఇండియా కూటమికి మద్దతిస్తే.. ఆయనపై ఉన్న కేసుల తుట్టె కదులుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పైగా.. కేసులు పెట్టించిందే కాంగ్రెస్ పార్టీ అనే అభిప్రాయంలో ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఇండియా కూటమిలో ఏమేరకు చేరతారు? అనేది కూడా ప్రశ్నే. అయితే.. ఇదంతా రాజకీయంగా హైప్ తెచ్చేందుకు జరుగుతున్న చర్చగా కొందరు చెబుతుంటే.. కాదు నిజంగానే వైసీపీ విషయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో చర్చించనున్నారని సీనియర్లు కూడా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.
This post was last modified on July 30, 2024 10:38 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…