ఏపీలో పేదలకు గత ప్రభుత్వం ‘జగనన్న ఇళ్లు’ పేరుతో పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని ఇచ్చింది. అయితే.. 30 లక్షల మందికి అని చెప్పినా.. 20 లక్షల మందికి మాత్రమే ఇవ్వడం గమనార్హం. మిగిలిన వారికి ఇంకా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారు. మిగిలిన వారికి కూడా ఇస్తామన్నారు. అయితే.. ఆయన సర్కారు పడిపోయింది. ఇక, ఎన్నికల సమయంలో తాము అధికారం లోకి వస్తే.. పట్టణ పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మూడు సెంట్ల చొప్పున భూములు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు దానిని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
తాజాగా హౌసింగ్ పై జరిపిన సమీక్షలో ఎవరెవరికి ఎంతంత భూములు ఇవ్వాలనే అంశంపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. పట్టణ పేదలకు 2 సెంట్ల నివాసయోగ్యమైన భూమిని, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఏకంగా 3 సెంట్ల భూమిని ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. ఈ సదుపాయం కొత్తగా దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు మాత్రమే వర్తించనుంది. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపింది. అయితే.. వాటిలో ‘లే ‘అవుట్లు వేయలేదు. అలాంటి స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. పట్టణాల్లో ఉంటే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 3 సెంట్ల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు.
100 రోజుల ప్లాన్!
రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల్లోనే పేదలకు నివాసయోగ్యమైన భూములను ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. కేవలం భూములు ఇవ్వడమే కాకుండా.. ఇళ్ల నిర్మాణం కూడా చేయించి ఇస్తామన్నారు. తొలి 100 రోజుల్లో లక్షకుపైగా, తర్వాత ఏడాది కాలంలో 8 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా.. కేంద్ర పథకాన్ని కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగనున్నట్టు తెలిపారు.
మరికొన్ని వర్గాలకు కూడా..
This post was last modified on July 30, 2024 1:32 pm
వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్న నాని ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్దిల…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి జైలు కష్టాలను ఎలాగోలా తప్పించుకున్నా… గుంటూరులోని సీఐడీ…
ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక…
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఎదురైన పాఠాలే.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు భవిష్యత్తు మార్గాలను చూపిస్తున్నాయా? ఆదిశగా…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామవరం మండలం…