టైమొస్తే.. ఎవరినీ ఊరుకోబోమని.. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎవరు తప్పు చేసినట్టు రుజువైనా ఊరుకునేది లేదన్నారు. ఖచ్చితంగా జైలుకు పంపిస్తామన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా.. జగనైనా ఎవరు తప్పు చేసినట్టు తేలినా ఊరుకునేలేదని తేల్చి చెప్పారు. మదనపల్లె సబ్ కలక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం.. ఉద్దేశ పూర్వకంగా చేసిందేనని, దీని వెనుక ఎవరున్నారనే విషయాన్ని కూపీ లాగే పనిలో ఉన్నామని తెలిపారు. ఇప్పటికే సీనియర్ అధికారి సిసోడియా అక్కడ మూడు రోజులపాటు మకాం వేసి.. విచారణ సాగించారని తెలిపారు.
ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అనగాని తెలిపారు. అగ్ని ప్రమాదాన్ని ఉద్దేశ పూర్వంగానే చేసినట్టు తెలిసిన దరిమిలా.. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా.. శిక్షించి తీరుతామని పరోక్షంగా ఆయన జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “టైమొస్తే పెద్దిరెడ్డి అయినా, జగన్ అయినా చర్యలు తప్పవు” అని మంత్రి అనగాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కలెక్టర్ ఆఫీసుల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉందని తెలిసిందన్నారు. వీటిపైనా విచారణ చేయిస్తామన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కేవలం వేల రూపాయలకు లీజులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఇలాంటివి ఎలా జరిగాయో తేలుస్తామని మంత్రి చెప్పారు. వీటిపైనా విచారణ చేయించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అనగాని.. గత ప్రభుత్వం 22ఏ అసైన్డ్ బూమలును పప్పు బెల్లాల్లా పంచిపెట్టేందుకే నిబంధనలు ఎత్తేసిందని విమర్శించారు. ఇప్పటివరకు ఇలా ఎంత మంది ఆస్తులు చేజిక్కించుకున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్టు తెలిపారు. భూముల సర్వే పేరుతో ప్రజ ధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పారు. సరిహద్దు రాళ్ల కోసం, వాటిపై జగన్ ఫొటోలు వేసుకునేందుకు 350 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని తెలిపారు. వీటిని తొలగించేందుకు మరో 15 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇదంతా వృథా ఖర్చేనని..దీనిని అప్పటి పాలకుల నుంచి రికవరీ చేసేందుకు ఆలోచిస్తున్నట్టు తెలిపారు.
జగన్ పాలనలో జరిగిన భూ పందేరాలపైనా విచారణ చేయించాలని చూస్తున్నామన్నారు. కొన్ని మఠాలకు ఉదారంగా ప్రజలకు చెందిన, ప్రభుత్వానికి చెందిన భూములు కూడా ఇచ్చేశారని తెలిపారు. వీటిని వెనక్కి తీసుకోవడంపై దృష్టి పెట్టామని.. కానీ, న్యాయ పరమైన చిక్కులు ఎదురవుతాయని.. అయినపట్టికీ ముందుకు వెళ్లాలని బావిస్తున్నామని తెలిపారు. త్వరలోనే వీటిపై మరింత క్లారిటీ వస్తుందని మంత్రి అనగాని తేల్చి చెప్పారు.
This post was last modified on July 30, 2024 7:18 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…