వైసీపీకి చాలా మంది నాయకులు ఉన్నారు. వీరిలో కొందరు ఫైర్ బ్రాండ్స్‌గా కూడా ముద్ర పొందారు. ఇలాంటి వారు… ఎప్పుడు కావాలంటే అప్పుడు విరుచుకుపడేవారు.
మైకున్నా.. లేకున్నా.. తమదైన శైలిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్.. ఇలా అప్పట్లో విపక్ష నాయకులుగా ఉన్న వారిపై తీవ్ర విమర్శలు చేసేవారు. మాటకు మాట.. అన్నట్టుగా రియాక్ట్ అయ్యేవారు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందు కు మౌనంగా ఉంటున్నారు? అనేది ప్రశ్న.
కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్సకరరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు… ఇలా అనేక మంది నాయకులు ఫైర్ బ్రాండ్లుగా చలామణి అయ్యారు. పెద్ద ఎత్తున మీడియాలోనూ హల్చల్ చేశారు.
కొందరు వివాదాలకు కేరాఫ్ అయితే.. మరికొందరు నిర్మాణాత్మక విమర్శలు, సబ్జెక్ట్ వారీ వివరణలకు కూడా దారి తీశారు. ఇలా.. ఏదో ఒక రూపంలో అయితే.. వైసీపీ ఫైర్ బ్రాండ్లు నిత్యం మీడియా ముందుకు వచ్చేవారు.
కట్ చేస్తే.. పార్టీ అధికారం కోల్పోయి.. 50 రోజులు అయిపోయింది. అయితే.. ఈ మధ్య కాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్రామీణ, పట్టణ, నగర స్థాయిలోనూ.. జిల్లా స్థాయిలోనూ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. మరోవైపు అసెంబ్లీలో శ్వేత పత్రాల పేరుతో సర్కారు జగన్ పాలనను ఏకేసింది. మరి ఇంత జరిగినా.. ఫైర్ బ్రాండ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకు రాలేదు. వినుకొండలో జరిగిన హత్యకు సంబంధించి స్థానికంగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు వంటి నాయకులు మాట్లాడాలి.
కానీ, ఎక్కడో అనకాపల్లిలో ఉన్న గుడివాడ అమర్నాథ్ స్పందించారు. మొత్తంగా చూస్తే.. వైసీపీలో బలమైన గళం వినిపించే నాయకులు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. మరి దీనికి కారణం ఏంటి? అంటే.. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లకు సంబంధించి అరెస్టయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితే తమకు కూడా పడుతుందని ఫైర్ బ్రాండ్లు అంచనా వేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇదే నిజమైతే.. మున్ముందు.. ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి ఉండదనే భావించాలి.
This post was last modified on July 29, 2024 5:43 pm
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి విచిత్రంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కీలకమైన సమయం లో ఆయన మౌనంగా ఉంటూ..…
నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ నుంచి నిన్న మొదటి ఆడియో సింగల్ రిలీజయ్యింది. అక్కినేని…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి.. ఇప్పుడు అంతా తానై వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ.…
క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి…
టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…
గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం.…