ఏపీ రాజకీయాల్లో ఎక్స్ వేదికగా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీ పీ నేతల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో వాదన జరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా.. వైసీపీ ఎంపీ, సీనియర్ నేత విజయసాయిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తున్న విషయం తెలిసిందే. దేవదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె బిడ్డ వ్యవహారం.. రాష్ట్రంలో అనేక మలుపులు తిరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… రెండు మూడు రోజులుగా సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
రాష్ట్రంలో శాంతికి భద్రత లేకుండా పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో తమ ప్రభు త్వం అందరికి సమానంగా శాంతి భద్రతలు అందిస్తుందని కూడా అనిత చెప్పారు. ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. సాయిరెడ్డి ఎక్స్‌లో విమర్శలు గుపించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదు. బొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. అందుకే రాష్ట్రం భయం గుప్పిట్లోకి జారుకుందని” సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే.. సాయిరెడ్డి కామెంట్లకు అనిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అది కూడా ప్రస్తుతం జరుగుతున్న వివాదానికి ముడిపెట్టి మాటకు మాట అన్నారు. ‘శాంతి’ భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో.. నేను చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. అయినా ఇది ‘డీఎన్ ఏ’ ప్రభుత్వం కాదు. ‘ఎన్‌డీఏ’ ప్రభుత్వం(శాంతి భర్త మదన్.. సాయిరెడ్డి డీఎన్ ఏ టెస్టు చేయించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో). ప్రజలు బాగానే ఉన్నారు. దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు పెడుతున్నారు(జగన్‌ను ఉద్దేశించి). ఎక్స్‌లో రెట్టలు వేస్తున్నారు(సాయిరెడ్డిని ఉద్దేశించి) అని అనిత వ్యాఖ్యానించారు.
This post was last modified on July 28, 2024 4:45 pm
నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ నుంచి నిన్న మొదటి ఆడియో సింగల్ రిలీజయ్యింది. అక్కినేని…
క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి…
టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…
గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం.…
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…