Political News

జగన్ స్థాయికి ఇది తగునా?

ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పది శాతం సీట్లు కూడా రాకపోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని సంగతి తెలిసిందే. కానీ ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను ప్రభుత్వం ఇవ్వలేదంటూ వైసీపీ అధినేత జగన్ అలిగారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకే వెళ్లనని భీష్మించుకు కూర్చున్నారు.

ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడికి వెళ్లకుండా.. బయట కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ ఢిల్లీలో ధర్నా చేశారు. మళ్లీ అమరావతికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ అక్కడ ఢిల్లీలో, ఇక్కడ అమరావతిలో జగన్ చర్యలు, మాటలు ఆయనకు మరిన్ని విమర్శలు తెచ్చిపెట్టాయే తప్ప.. పెద్దగా సాధించిందేమీ లేదు. ప్రెస్ మీట్ అంటే అనుకూల, వ్యతిరేక అని తేడా లేకుండా అన్ని మీడియా సంస్థలనూ పిలవాలి. ఇరుకున పెట్టే ప్రశ్నలు వేసినా.. ఎదుర్కోవాలి. అంతే తప్ప నచ్చని మీడియాను అనుమతించకుండా.. అనుకూల మీడియానే పిలిపించుకుని వన్ సైడెడ్‌గా ప్రెస్ మీట్ నడిపించి ప్రయోజనం ఏంటన్నది ప్రశ్న.

ఈ ప్రెస్ మీట్లో పొరపాటున ఒక నెగెటివ్ ప్రశ్న జగన్‌కు ఎదురైంది. మీ కుటుంబంలో జరిగిన హత్య (వివేకా) గురించి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారు కదా అని అడిగితే.. రాష్ట్రంలో 50 రోజులుగా ఇన్నిన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే మనమే ఇలా డైవర్ట్ చేసి మాట్లాడితే ఎలా అంటూ ఆ టాపిక్‌ను తనే డైవర్ట్ చేసి మాట్లాడ్డం గమనార్హం. ఈ ప్రెస్ మీట్ మొత్తంలో హైలైట్ ఏంటంటే.. తాను ఒక ముఖ్యమంత్రిగా పని చేశాననే సంగతి కూడా మరిచిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చేసిన ఓ ఆరోపణ.

చంద్రబాబు, తమ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు కలిసి చదువుకున్నారని.. ఐతే యూనివర్శిటీలో ఒకసారి పెద్దిరెడ్డి.. చంద్రబాబును కొట్టాడని, అది మనసులో పెట్టుకుని బాబు ఇప్పుడు ఆయన మీద కక్ష సాధిస్తున్నారని ఏదో ఛోటా మోటా నాయకుడిలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్. ఐతే చంద్రబాబు యూనివర్శిటీలో చదువుకునే రోజులంటే 50 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అప్పుడు జరిగింది మనసులో పెట్టుకున్నట్లే అయితే 90వ దశకంలోనే బాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కూడా రెండు పర్యాయాలు సీఎంగా పని చేశారు. పెద్దిరెడ్డిని ఏమైనా చేయాలనుకుంటే.. ఇన్నేళ్లు ఆగాలా? ఓవైపు పెద్దిరెడ్డి భూ కబ్జా బాధితులైన సామాన్యులు వందల మంది తమకు జరిగిన అన్యాయం మీద ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు సమర్పిస్తుంటే.. జగన్ ఏమో ఆయన ఉత్తముడని సర్టిఫై చేస్తూ 50 ఏళ్ల ముందు విషయాలు చెప్పి బాబు కక్ష సాధిస్తున్నాడని పేర్కొనడం విడ్డూరం. ఇలాంటి మాటలతో జగన్ పలుచన కావడం తప్ప పైసా ప్రయోజనం ఉండదని ఆయన పక్కనున్న వాళ్లు చెబితే మంచిది.

This post was last modified on July 27, 2024 3:34 pm

Share

Recent Posts

విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…

49 minutes ago

అర్జెంటీనా సముద్రం ఇంకి పోయిందా?

అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…

1 hour ago

శాంసంగ్ ఏడేళ్ల కష్టం.. యాపిల్ ఎందుకింత ఆలస్యం

ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…

2 hours ago

ఫౌజీ వెనుక అసలేం జరుగుతోంది

ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…

2 hours ago

స్కూలు సెలవు కోసం మర్డర్ ప్లాన్

మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…

2 hours ago

టాలీవుడ్ హీరోలూ… స్పీడ్ పెంచండయ్యా

కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…

2 hours ago