ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మాజీ సీఎం జగన్ తాజాగా రియాక్ట్ అయ్యారు. దీనిని ఎవరు చేసినా.. తప్పేనన్న ఆయన అయితే.. దీనిని ఇంతగా హైలెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అదే రోజు తాను.. వినుకొండలో పర్యటనకు వెళ్లి.. దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నించానని అన్నారు. ఈ సమయంలో మీడియా తనకు కొంత కవరేజీ ఇచ్చిందని, అయితే.. దీనిని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నారని అన్నారు.
దీనిలో భాగంగా ముందు రోజు రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై తెల్లవారి స్పందించకుండా.. సాయంత్రం నేను వినుకొండలో పర్యటించినప్పుడే పెద్ద ఎత్తున హడావుడి చేయడం రాజకీయ వ్యూహంలో భాగంగా కాదా? అని ప్రశ్నించారు. ఒకటికి మూడు సార్లు రివ్యూ చేశారని.. ఆ వెంటనే సీఐడీ చీఫ్, డీజీపీల ను కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్ ఇచ్చి అక్కడకు పంపించారని.. కానీ, అప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. ఒకవేళ నిజంగానే.. ఆర్డీవో ఆఫీసులో ఫైళ్లు తగలబడి పోయినా.. కలెక్టర్ ఆఫీసులో భద్రంగా ఉంటాయని.. లేకపోతే.. ఆన్‌లైన్‌లోనే ఉంటాయని తెలిపారు.
పోనీ..అక్కడ కూడా లేకపోతే.. అమరావతిలోని సీసీఎల్ ఏ డేటాలో భద్రంగా ఉంటాయని.. ఈ విషయం చంద్రబాబుకు తెలిసి కూడా.. పెద్ద ఎత్తున హడావుడి చేశారని అన్నారు. దీనికి కారణం.. వినుకొండలో తన పర్యటనను డైల్యూట్ చేయాలన్న ఉద్దేశమేనని జగన్ వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబుకు అంత బాధ్యత ఉంటే.. నంద్యాలలో నిమచ్చుమర్రిలో బాలికపై జరిగిన హత్యాచార ఘటనను ఇంత సీరియస్‌గా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అసలు పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏకంగా 12 మంది మహిళలపై అత్యాచారం.. నలుగురిపై అత్యాచారం, హత్య కూడా జరిగాయని. వాటిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. మదనపల్లె ఘటనలో ఏదో జరిగిపోయిందని తెలుపుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలపై ఏదో అభాండాలు వేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కానీ రామచంద్రరెడ్డి 7 సార్లు ఎమ్మెల్యేగా, మిథున్ రెడ్డి మూడు సార్లు ఎంపీగా గెలిచారని.. వారిని ప్రజలు ఆదరిస్తుండబట్టే కదా.. గెలిచారని జగన్ వ్యాఖ్యానించారు.
This post was last modified on July 26, 2024 6:51 pm
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…