Political News

జ‌గ‌న్ ఓపెన్ మైండ్ రాజ‌కీయాలే బెస్ట్‌..!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు పార్టీకి శ్రీరామరక్ష. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినని నాయకుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారు. ఆయన విన్నారా వినలేదా.. నాయకులు సలహాలు ఇచ్చారా లేదా.. లేక‌, ఎవరి పనిలో వారు ఉండిపోయారా? అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత మాత్రం నేను చెప్పింది వినలేదు. నా మాట లెక్కచేయలేదు అంటూ చాలామంది నాయకులు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా విమర్శలు చేసిన పరిస్థితి తెర‌మీదికి వ‌చ్చింది.

ఒక‌వేళ‌ అది నిజమే అని అనుకుంటే మార్పు దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పార్టీ అత్యంత సంక్లిష్ట స్థితిలోకి మారిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీకి మిగిలా రు. వీరిని ఒక వైపు కాపాడుకుంటూ.. మరోవైపు ఐదు సంవత్సరాల పాటు పార్టీని బతికించుకోవడం జగన్ కి చాలా ఇబ్బందికరమైన ప‌నేన‌ని చెప్పాలి. జగన్ ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ఓపెన్ మైండ్ రాజకీయాలు చేయుటమే. నాయ‌కుల మాట‌కు, వారి సూచ‌న‌ల‌కు, స‌ల‌హాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

జ‌గ‌న్ స్వ‌యంగా.. తాను ఏమనుకుంటున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకుందామని భావిస్తున్నారు? ఏ విషయం మీద ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు? అనే విషయాన్ని పార్టీ నాయకులతో కలిసి చర్చించటం చాలా ముఖ్యం.

గ‌త ఐదేళ్లు ఈ ప‌రిస్థితి లేక‌పోవ‌డంతోనే పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని అంటారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నించుకుని.. నాయ‌కుల నిర్ణయాలకు కూడా ప్రాధాన్యం కల్పించడం ఇప్పుడు జగన్ ముందు ఉన్న ప్రధానమైనటువంటి ప‌రిస్థితి.

తాజాగా ఢిల్లీలో చేపట్టిన ధర్నా విషయాలను పరిశీలిస్తే దీనిని వైసీపీ నాయకులు స్వాగ‌తిస్తున్న‌ పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టుగా వార్తలు వచ్చాయి. జాతీయస్థాయిలో యాగీ చేయటం ద్వారా పార్టీకి లాభం ఉండదని మెజారిటీ నాయకులు అన్నట్టుగా సమాచారం. ఇదిలావుంటే, ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయాన్ని జగన్ ముందుగానే వారితో చర్చించలేదనే వాద‌న వినిపించింది.

కేవ‌లం ప్రకటన రూపంలో మాత్రమే ఢిల్లీ ధ‌ర్నాపై స‌మాచారం ఇచ్చారని.. అంటున్నారు. అయితే ఇది కరెక్ట్ అవుతుందా..? కాదా? అనేది పక్కన పెడితే పార్టీలో ఇప్పుడు కావలసింది ఉమ్మడి నిర్ణయాలు. సమష్టి కృషి. ఐక్యంగా ముందుకు సాగటం. మూడు సూత్రాలను జగన్ పాటించేలా వ్యవహరించాలి. అప్పుడు మాత్ర‌మే బ‌లంగా పార్టీ నిల‌బ‌డే అవ‌కాశం ఉంటుంది.

This post was last modified on July 25, 2024 11:50 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago