ఏపీ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి పుట్టిన బిడ్డ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బిడ్డకు సుభాష్ రెడ్డి తండ్రి అని శాంతి చెబుతుంటే.. తాను కాదని సుభాష్ చెప్పేశాడు. ఇక, అసలు భర్త.. మదన్ మోహన్ మాత్రం శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డేనని తేల్చి చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హోం మంత్రికి కంప్లయింట్ కూడా చేశారు.
సాయిరెడ్డే.. శాంతి బిడ్డకు తండ్రి అని మదన్ వాదన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఓ వైపు వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తుంటే.. మరో పక్కన మదన్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. ధర్నాకు కూర్చోవడం సంచలనంగా మారింది. సాయిరెడ్డికి డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. చిత్రం ఏంటంటే.. జగన్ చేపట్టిన ధర్నాలో సాయిరెడ్డి కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ధర్నాకు సమీపంలోనే.. మదన్ కూడా పాల్గొన్నాడు.
ఇతర ప్రజాసంఘాల నాయకులతో కలసి జంతర్ మంతర్ వద్దకు వచ్చిన మదన్.. ధర్నా చేశారు. తన భార్య శాంతికి మాయ మాటలు చెప్పి విజయసాయిరెడ్డి మోసం చేశారని, బిడ్డకు ఆయనే తండ్రి అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి రాజ్యసభ సభ్వత్వాన్ని కూడా రద్దు చేయాలని.. డీఎన్ఏ టెస్టు చేయించాలని డిమాండ్ చేయడం గమనార్హం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన భార్యతో అనేక చట్ట విరుద్ధమైన పనులు చేయించారని మదన్ చెప్పడం విశేషం. వేల కోట్ల విలువైన భూములను శాంతిని అడ్డుపెట్టుకుని దోచేశారని అన్నాడు.
ముదురుతున్న వివాదం..
శాంతి-బిడ్డ-తండ్రి- వ్యవహారం ముదురుతోంది. మదన్‌కు జాతీయ గిరిజన సంఘాలు సంఘీభావం ప్రక టించాయి. సాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ.. సంఘాల జేఏసీ నేత సుభాష్ చంద్ర.. రాష్ట్రపతి ముర్ముకు వినతి పత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. అదేసమయంలో రాజ్యసభ చైర్మన్‌కు కూడా వినతిపత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు. సాయిరెడ్డి డీఎన్‌ఏ టెస్టుకు రెడీ కావాలని డిమాండ్ చేశారు.
This post was last modified on July 25, 2024 7:05 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…