Political News

‘మేనేజ్‌మెంట్ కోటా వ‌ర్సెస్‌ పేమెంట్ కోటా’

తెలంగాణ అసెంబ్లీలో మాట‌ల తూటాలు పేటాయి. బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే కేటీ ఆర్ వ‌ర్సెస్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిల మ‌ధ్య సంభాష‌ణ హాట్ హాట్‌గా సాగింది. తాజాగా కేంద్ర ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌పై అసెంబ్లీలో చ‌ర్చ సాగింది. ఈ సంద‌ర్భంగా అస‌లు చ‌ర్చ ప‌క్క‌కు పోయి.. అన‌వ‌స‌ర ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది.

  • ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీల‌క‌మైన బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు.. మాజీ సీఎం కేసీఆర్ ఉంటే బాగుండేద‌న్నారు. ఆయ‌న ఎందుకు రాలేద‌ని.. కేటీఆర్‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు.
  • ఈ సంద‌ర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. ‘మాకు జవాబు చెప్పండి చాలు. మీకు కేసీఆర్‌ అవసరం లేదు’ అన‌డంతో సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స‌మ‌యంలోనేచ‌ర్చ కాస్తా గాడి త‌ప్పింది.
  • “నాన్న పేరుచెప్పుకుని నేను మంత్రిని కాలేదు. కింది స్తాయి నుంచి వ‌చ్చి జెండా ప‌ట్టుకుని మోసి.. ముఖ్యమంత్రి అయ్యా” అని అన్నారు. దీంతో స‌భ‌లో చ‌ర్చ ఒక్కసారిగా యూట‌ర్న్ తీసుకుంది. ఆయ‌న అక్క‌డితోనూ ఆగ‌లేదు. “కేటీఆర్ ది మేనేజ్‌మెంట్ కోటా. అలానే వ‌చ్చి.. మంత్రి అయ్యాడు” అని వ్యాఖ్యానించారు.
  • ఇక‌, దీంతో కేటీఆర్ అందుకుని.. రేవంత్ పేమెంట్ కోటాలో ముఖ్య‌మంత్ర‌య్యారా? అని ప్ర‌శ్నించారు.
  • మ‌రోసారి రేవంత్ మాట్లాడుతూ.. “పేమెంట్ కోటాలో నేను ముఖ్య‌మంత్రి కాలేదు. కానీ..మొన్న మీ వోళ్లే ఢిల్లీలో చీక‌ట్ల సంప్ర‌దింపులు జ‌రుపుకొని వ‌చ్చారు. ముందు అది చూసుకో” అని వ్యాఖ్యానించారు.
  • మ‌రోసారి కేటీఆర్ స్పందిస్తూ.. స‌భానాయ‌కుడిగా ఉన్న ముఖ్య‌మంత్రి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తోదా? అని ప్ర‌శ్నించారు. నేను మేనేజ్‌మెంట్ కోటాలో మంత్రి అయ్యాన‌ని ముఖ్య‌మంత్రి అనొచ్చా? అని ప్ర‌శ్నించారు.
  • తిరిగి సీఎం రేవంత్ జోక్యం చేసుకుని.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కేసీఆర్ గతంలో మోడీకి తాక‌ట్టు పెట్టార‌ని.. విమ‌ర్శించారు. మాకేమీ అక్కర్లేదు.. మీ ప్రేమ చాలని చెప్పి మోడీకి స‌లాం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. లోక్‌సభలో గుండుసున్నా దక్కినా తీరు మారకుంటే ఎలా? అని ఎద్దేవా చేశారు.

This post was last modified on July 24, 2024 3:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొదటి రిలీజ్ 3 కోట్లు – రీ రిలీజ్ 7 కోట్లు

ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…

5 hours ago

శంకర్ ఆడుతున్న ఒత్తిడి గేమ్

సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…

6 hours ago

ముందు లక్కు వెనుక చిక్కు

యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…

6 hours ago

జానీ మాస్ట‌ర్‌పై జ‌న‌సేన వేటు.. ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై పార్టీ వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా…

6 hours ago

డిజాస్టర్ సినిమాకు రిపేర్లు చేస్తున్నారు

కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…

11 hours ago

చిన్న బడ్జెట్‌లతో పెద్ద అద్భుతాలు

స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…

11 hours ago