Political News

జ‌గ‌న్‌కు మైండ్ పనిచేయ‌ట్లా: మంత్రి హాట్ కామెంట్స్‌

వైసీపీ అధినేత‌, విప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌కు మైండ్ ప‌నిచేయ‌ట్లేద‌ని.. అందుకే నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న హ‌త్య‌ల్లో టీడీపీ వారే ఎక్కువ‌గా చ‌నిపోయిన విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తించాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు హ‌త్య‌లు జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని .. అయితే.. మూడు ఘ‌టన‌ల్లో ముగ్గ‌రు టీడీపీ నాయ‌కులు మృతి చెందార‌ని తెలిపారు.

వినుకొండ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో వైసీపీ వాళ్లే వైసీపీ వాళ్ల‌ను చంపుకొన్నార‌ని స్థానికంగా చ‌ర్చ సాగుతోందన్నారు. ఈ విష‌యాల‌ను దాచేసి రాష్ట్రంలో 36 హ‌త్య‌లు జ‌రిగిన‌ట్టు జ‌గ‌న్ విష ప్ర‌చారం చేస్తున్నార‌ని తెలిపారు. ఒక‌వేళ అవి నిజ‌మే అయితే.. 36 హ‌త్య‌ల వివ‌రాల‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అనిత డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన నేప‌థ్యంలో జ‌గన్‌కు మైండ్ ప‌నిచేయ‌ట్లేద‌ని అనిత వ్యాఖ్యానించారు. అందుకే నోటికి ఏది వ‌స్తే అది చెబుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

అధికారం ఎందుకు కోల్పోయిందో జ‌గ‌న్ ఆలోచ‌న చేసుకోవాల‌ని మంత్రి అనిత సూచించారు. కానీ.. దానిని వ‌దిలేసి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని.. ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ జ‌గ‌న్‌ను న‌మ్మ‌బోర‌ని అనిత చెప్పారు. వాస్త‌వానికి విరుద్ధంగా రాష్ట్రంలో హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్న జ‌గ‌న్‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకూడ‌ద‌ని ఆమె ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు వ‌చ్చిన ఇబ్బంది లేద‌ని.. అధికారం పోవ‌డంతో .. జ‌గ‌న్‌కే శాంతి లేకుండా పోయింద‌ని.. అందుకే ఆయ‌న ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తు న్నారని అనిత వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే.. ఎంపీ లావు శ్రీకృష్ట దేవ‌రాయులు కూడా.. జ‌గ‌న్‌ను సూటిగా ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో హ‌త్య‌లు పెరిగిపోయాయ‌ని చెబుతున్న జ‌గ‌న్.. అంకెత‌ల‌తో కాదు.. ప‌క్కా లెక్క‌ల‌తో రావాలని ఎంపీ స‌వాల్ రువ్వారు. అప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. 36 మంది హ‌త్య‌కు గుర‌య్యార‌న్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు. అదే నిజ‌మైతే.. ఆయా వివ‌రాలు.. వారి పేర్లు, అడ్ర‌స్‌ల‌ను వెల్ల‌డించాల‌ని సూచించారు.

This post was last modified on July 21, 2024 9:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

5 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

7 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

8 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

10 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

11 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

11 hours ago