సుఖాల్లో ఉన్నప్పుడు.. బంధువులు కనిపిస్తే.. కష్టాల్లో వారి సాయం అందుతుంది. సుఖాల్లో ఉన్నప్పుడు.. చేతినిండా సొమ్ములు ఉన్నప్పుడు.. బంధువులను దూరం పెట్టి.. తూలనాడిన తర్వాత..కష్టాల్లో వారిని రమ్మంటే వస్తారా? – అచ్చంగా ఇలానే ఉంది .. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరిస్థితి. అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు.. ప్రతిపక్షాలను కనీసం పట్టించుకోలేదు. టీడీపీ, జనసేనల విషయాన్ని పక్కన పెడితే.. మిగిలిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఆయన కలవనివ్వలేదు.
పోలవరం ప్రాజెక్టు సహా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అఖిల పక్షం వేయాలని.. ఆయా సమస్యలపై అధ్యయ నం చేసి.. కేంద్రానికి వెళ్దామని.. నిధులు తెచ్చుకుందామని కమ్యూనిస్టులు నెత్తీనోరూ కొట్టుకున్నారు. అయినా.. జగన్ వినిపించుకోలేదు. కనీసం.. ప్రభుత్వం మాట ఎత్తే అవకాశం కూడా లేకుండా చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఉన్నది.. ఉండబోయేది.. వైసీపీనేనని.. మరో పార్టీనే లేదని కూడా ఆయన పరివారంతో చెప్పించారు. దీంతో చేసేది లేక కమ్యూనిస్టులు.. ఇతర ప్రజాసంఘాలు మౌనంగా ఉన్నాయి.
కానీ, కాలం బలమైనది. ప్రజాతీర్పు మరింత కఠినంగా ఉంటుందనే విషయాన్ని వైసీపీ సహా అధినేత గుర్తెరగలేకపోయారు. ఇప్పుడు ప్రజాతీర్పు అనే జ్వాలల్లో వైసీపీ మాడి మసైపోయింది. ఇప్పుడు పార్టీని నిలబెట్టుకునేందుకు తన అస్థిత్వాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఆయన ఓ సంచలన పిలుపునిచ్చారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్దామని
పార్టీ నాయకులకు చెప్పారు.
కానీ, ఇప్పుడు కలిసి వచ్చే పార్టీలు ఏవి? కలిసి నడిచే నాయకులు ఎవరు? అని చూసుకుంటే.. భూతద్దం పెట్టి వెతికినా.. ఎవరూ కనిపించడం లేదు. ఎందుకంటే. అధికారంలో ఉన్నప్పుడు.. కనీసం వారిని పలకరిస్తే కదా! ఇప్పుడు కలిసిరావడానికి? అలా చేయకుండా.. ఇప్పుడు తన కష్టాలను వారి కష్టాలుగా ప్రొజెక్టు చేసి.. అందరినీ కలుపుకొని వెళ్దామనే తన రాజకీయ ఎత్తుగడలకు లొంగేదెవరు? కలిసి కాలు కదిపేదెవరు? ఒక్కరంటే ఒక్కరు కూడా.. ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏదేమైనా.. అధికారంలో ఉన్నపుడు నేలపై నడిచి ఉంటే.. అందరూ కలిసి వచ్చేవారు. కానీ..జగన్ చేసుకున్న పాపం.. ఇప్పుడు ఆయనను వెంటాడుతోంది.
This post was last modified on %s = human-readable time difference 1:21 pm
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…
విజన్ 2047 లక్ష్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే. అమరావతిని…
అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో…
అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే యూవీ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్…
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సోమవారం ఫార్మా సిటీ నిర్మాణానికి సంబంధించిన భూములను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ పై…