ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలి సిందే. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండలో నడిరోడ్డుపై రెండు రోజుల కిందట జరిగిన దారుణ హత్యలో ప్రాణాలు కోల్పోయిన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం.. కొన్ని సంచల న ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఆ వెంటనే ఈ విషయాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుగా ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు.
అయితే.. ఇక్కడే అసలైన వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు. జగన్ చేయనున్న ధర్నా.. 24వ తేదీ అయితే.. ఆ మర్నాడే.. ఏపీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం సభకు సమర్పించనుంది. ఈ నేపథ్యంలో జగన్ చేపట్టనున్న ధర్నాకు ప్రాదాన్యం ఏర్పడింది. ఎలాగంటే.. ఆయన అక్కడ ధర్నా చేస్తే.. సహజంగా నే జాతీయ మీడియా ప్రసారం చేస్తుంది. రాష్ట్ర మీడియా కూడా విధిలేని పరిస్థితిలో ప్రాధాన్యం కల్పిస్తుంది.
దీంతో మరుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్పై చర్చ పక్క దారి పడుతుంది. ఇదే జగన్‌కు ఆ పార్టీ నాయకులకు కూడా కావాల్సి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక, జాతీయ స్థాయి లో ధర్నా చేయడం ద్వారా.. రాష్ట్రంలో వైసీపీని పుంజుకునేలా చేయాలన్నది జగన్ మరో వ్యూహంగా ఉందని అంటున్నారు. నెల రోజులు దాటిపోయినా.. తమ నాయకుడు ఇంకా తేరుకోలేదని భావిస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఈ ధర్నా ద్వారా సందేశం పంపించాలన్నది జగన్ ఉద్దేశమై ఉంటుంద ని భావిస్తున్నారు.
అంటే.. ఢిల్లీ లో ధర్నా చేయడం ద్వారా.. జాతీయ, రాష్ట్ర మీడియాలో లైవ్ లో ఉండడం.. అదేసమయం లో పార్టీలోనూ పుంజుకునే వాతావరణాన్ని కల్పించడం.. చంద్రబాబు తొలి బడ్జెట్పై చర్చలేకుండా చేయా లన్న వ్యూహాలు ఉన్నాయనేది విశ్లేషకుల అంచనా. నిజానికి ఇప్పటికిప్పుడు జగన్ ఢిల్లీలో ధర్నా చేసి నా.. మోడీ కానీ. కేంద్ర సర్కారు కానీ.. పట్టించుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఏపీలో ఉన్నది కూడా. కూటమి సర్కారే. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 20, 2024 5:23 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…