Political News

అటు జ‌గ‌న్‌-ఇటు కేసీఆర్‌.. ఒక‌టే ఇష్యూ!!

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇద్ద‌రూ రాజ‌కీయ మిత్రుల‌నే విష‌యం తెలిసిందే. ముఖ్య‌మంత్రులుగా ఉన్న స‌మ‌యంలో ఇరువురు నాయ‌కులు కూడా ఎవ‌రినీ లెక్క చేయ‌లేదు. తాము చెప్పిందే వేదం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా అధికారం కోల్పోయారు. ఇక‌, ఇద్ద‌రిలోనూ కామ‌న్‌గా ఉన్న ఇష్యూ.. తాము అధికారంలో ఉండి.. తాము ఏం చేసినా.. చెల్లుతుంద‌నే టైపు. అధికారం కోల్పోయాక‌.. ఏం జ‌రిగినా.. అప్పుడు ప్ర‌జాస్వామ్యం, విలువ‌లు, వ‌లువ‌లు అంటూ వ్యాఖ్య‌లు చేస్తారు. త‌మ వారిని రోడ్డెక్కిస్తారు.

ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. ఇప్పుడు జ‌రుగుతున్న హ‌త్య‌లు, అత్యాచారాల‌ను అంద‌రూ ఖండించాల్సిందే. ఖండిస్తున్నారు కూడా. కానీ, ఈ విష‌యంపై జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు చూస్తే.. రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న‌లు ఇప్పుడే కొత్త‌న్న‌ట్టుగా.. గ‌తంలో ఎప్పుడూ ఏమీ జ‌ర‌గ‌న‌ట్టుగానే ఉన్నాయి. గ‌త ఐదేళ్లలో శాంతి భ‌ద్ర‌త‌లు భేష్‌గా ఉన్నాయ‌న్న భావ‌న కూడా ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కానీ వాస్త‌వాల జోలికి వెళ్తే.. డాక్ట‌ర్ సుధాక‌ర్ హ‌త్య నుంచి డెడ్‌బాడీ డోర్ డెలివ‌రీ వ‌ర‌కు.. ప‌ల్నాడులో క‌క్ష పూరిత రాజ‌కీయాల నుంచి పుంగ‌నూరులో దారుణాల వ‌ర‌కు ఎవ‌రూ మ‌రిచిపోలేదు.

అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మాత్రం.. ఇప్పుడే ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయిపోంద‌ని.. ప్ర‌భుత్వం శాంతి భ‌ద్ర‌త‌ల ను గాలికి వ‌దిలేసింద‌ని చెప్పుకొంటున్నారు. ఇక‌, కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న కూడా త‌క్కువేమీ కాదు. రాజ‌కీయాల‌ను త‌న చేతుల్లో పెట్టుకునేందుకు పార్టీల‌కు మ‌నుగ‌డే లేకుండా చేసేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీని విలీనం చేసుకున్న‌ప్పుడు.. స‌బితా ఇంద్రారెడ్డి వంటివారికి ప‌ద‌వులు ఇచ్చిన‌ప్పుడు.. ఆయ‌న‌కు ప్ర‌జాస్వామ్యం.. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్థ వంటివి ఎక్క‌డా మ‌చ్చుకు కూడా క‌నిపించ‌లేదు.

ఇదే ప‌ని పొరుగు పార్టీ చేస్తే.. కేసీఆర్‌కు చిర్రెత్తుకొస్తోంది. ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయిపోతోంది. పార్ల‌మెంట రీ చ‌ట్టాలు చ‌ట్టుబండ‌లైపోతున్నాయి. ఇత‌మిత్థంగా కేసీఆర్ చెప్పేది ఇదే. వారు మాత్ర‌మే వాటిని చేయా లని.. ఇత‌రులు ఎవ‌రూ చేయ‌రాద‌న్న విధంగా అటు జ‌గ‌న్ కానీ.. ఇటు కేసీఆర్ కానీ వ్య‌వ‌హ‌రించారు. సాధార‌ణంగా ఒక ఓట‌మి అనేక పాఠాలు నేర్పుతుంది. కానీ, ఒక ఓట‌మి వీరికి ఎలాంటి పాఠాలూ నేర్ప‌డం లేద‌నే భావ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. సో.. మున్ముందు మ‌రిన్ని ఓట‌ముల‌కు వారు సిద్ధ‌ప‌డ‌తా రేమో.. చూడాల‌ని అంటున్నారు.

This post was last modified on July 20, 2024 11:14 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

4 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

6 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

6 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

8 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

9 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

10 hours ago