ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు జోరు ప్రదర్శిస్తున్నారు. గత అయిదేళ్ల అరాచక పాలన నుంచి విముక్తి కోసం తమను నమ్మి ఓట్లు వేసిన జనానికి లబ్ధి చేకూర్చేలా బాబు పనిచేస్తున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ నొటిఫికేషన్‌తో పాటు పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం వంటి హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది. త్వరలోనే మిగిలిన హామీలను పట్టాలెక్కించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి అందించేందుకు బాబు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఏపీలోని నిరుద్యోగ యువతకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ వినిపించనున్నారని సమాచారం. నిరుద్యోగ భృతి అమలు కోసం కసరత్తు మొదలైందని తెలిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల ఇస్తామని బాబు చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? ఈ పథకం అమలు చేయాలంటే ఎంత బడ్జెట్ అవసరమవుతుంది? తదితర విషయాలపై దృష్టి పెట్టాలని అధికారులను బాబు ఆదేశించారని సమాచారం. జిల్లాల వారీగా నిరుద్యోగ యువత వివరాలను పరిశీలించేందుకు బాబు సిద్ధమవుతున్నారని టాక్.
నిరుద్యోగ భృతిని అందించేందుకు అవసరమైన విధివిధానాలు, అర్హతలపై బాబు ఫోకస్ పెట్టారని తెలిసింది. ఈ మేరకు టీడీపీ సోషల్ మీడియాలోని ఓ పోస్టు కూడా వైరల్‌గా మారింది. నిరుద్యోగ భృతి పొందాలంటే ఏపీకి చెందిన వాళ్లయి ఉండాలని, వయసు 22 నుంచి 35 లోపు ఉండాలని తెలుస్తోంది. అలాగే ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ నిరుద్యోగ భృతి పొందాలనుకునే వాళ్లకు ఇతర మార్గాల ద్వారా నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం రాకూడదు. ఇలా కొన్ని నిబంధనలు, అర్హతలను ఈ నిరుద్యోగ భృతికి ప్రామాణికంగా పెట్టుకున్నారని సమాచారం.
This post was last modified on July 19, 2024 3:09 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…