కోడి కత్తి శీను…ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. రాజకీయాలలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2019లో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తితో శీను దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ దాడి సింపతీతో జగన్ సీఎం అయ్యారని విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత 5 సంవత్సరాల వరకు శీను జైల్లో మగ్గిపోయాడు. ఎట్టకేలకు 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో బెయిల్ పై విడుదలయ్యాడు.
అయితే, శీనుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఈ కేసు విచారణ జరుపుతున్న ఎన్ఐఏ ఆశ్రయించింది. అయితే, ఎన్ఐఏ పిటిషన్ పై విచారణ జరిపిన దేశపు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులలో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. కోడికత్తి శీను బెయిల్ రద్దు చేయడం కుదరదని క్లారిటీనిచ్చింది. దీంతో, ఈ కేసులో ఎన్ఐఏకు చుక్కెదురైనట్లయింది.
కాగా, 2024 ఎన్నికలకు ముందు జై భీమ్ భారత్ పార్టీలో శీను చేరాడు. పేదల కోసం, వారి అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని శీను చెప్పాడు. కులమతాల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నాడు. మరోవైపు, ఈ కేసులో ఇప్పటివరకు జగన్ ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాని సంగతి తెలిసిందే. సీఎంగా బిజీగా ఉన్న జగన్ విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు చెప్పారు. మరి, ప్రతిపక్ష నేత కూడా కాని జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఫ్రీగా ఉన్నారు కాబట్టి విచారణకు హాజరవుతారా లేక మరేదన్నా కారణం చెప్పి ఎప్పటిలాగా కోర్టుకు గైర్హాజరవుతారా అన్నది వేచి చూడాలి.
This post was last modified on July 15, 2024 6:11 pm
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…
వైసీపీకి దశ-దిశ కొరవడిందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం…
మంచు విష్ణు హీరోగా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఎట్టకేలకు విడుదల తేదీని…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ…
ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి…
2012 లో ఉప్పెన మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి..శ్యామ్ సింగరాయ్,. బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్…