Political News

కేసీఆర్ మాట వినేవాళ్లెవ‌రు?

ఒక‌ప్పుడు ఆయ‌న మాట అంటే శాస‌నం. పార్టీలో, ప్ర‌భుత్వంలో ఆయ‌న మాట‌కు ఎదురే లేదు. వ‌రుస‌గా రెండు సార్లు సీఎం పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నార‌నే చెప్పాలి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు క‌దా.

అధికారం ఉంద‌ని ఎగిరెగిరి ప‌డితే ప్ర‌జ‌లు ఓటుతో త‌గిన బుద్ధి చెబుతార‌న్న‌ది కాద‌న‌లేని నిజం. ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఆ నాయ‌కుడి ప‌వ‌ర్ పోయింది. మాట‌లు వినేవాళ్లే లేరు. ఆ నేత ఎవ‌రో కాదు కేసీఆర్‌. అవును.. ఇప్పుడు కేసీఆర్ మాట‌ను వినేవాళ్లెవ‌రు? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మునిగిపోయే కారులో ఉండటం కంటే అధికారంలో ఉన్న చేయిని అందుకోవ‌డం మేల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వ‌రుస కట్టారు. ఇప్ప‌టికే 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అయ్యారు. మ‌రికొంత మంది లైన్లో ఉన్నారు. పార్టీ మొత్తం ఖాళీ అయ్యే ప‌రిస్థితి నెల‌కొంది.

అయినా కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఫామ్‌హౌజ్‌లో రెస్టు తీసుకుంటున్నారు. ఇటీవ‌ల ఒక‌సారి ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌తో స‌మావేశం పెట్టి పార్టీలోనే ఉండాల‌ని చెప్పారు. భ‌విష్య‌త్ బీఆర్ఎస్‌దేన‌ని పేర్కొన్నారు. కానీ ఆయ‌న మాట‌ల‌ను ప‌ట్టించుకోని నాయ‌కులు న‌మ్మ‌కం లేదు దొరా అంటూ రేవంత్‌కు జై కొడుతున్నారు.

ఒక‌ప్పుడు కేసీఆర్ మాట‌ను జ‌వ‌దాట‌ని నాయ‌కులు ఇప్పుడు లెక్క చేయ‌డం లేదు. కేసీఆర్ వైఖ‌రి కార‌ణంగానే గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే కేసీఆర్ మాట‌కు ఇప్పుడు విలువ లేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రోవైపు కేసీఆర్ కూడా వాస్త‌వ ప‌రిస్థితుల‌ను తెలుసుకుని సైలెంట్‌గా ఉండిపోతున్నార‌ని అంటున్నారు. పార్టీ మారొద్ద‌ని చెప్ప‌గ‌ల‌రు కానీ బ‌ల‌వంతంగా ఎవ‌రినీ ఆప‌లేరు క‌దా. కేసీఆర్ వ‌ర‌స చూస్తుంటే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయ‌మ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

This post was last modified on July 14, 2024 11:03 pm

Share
Show comments
Published by
Satya
Tags: KCR

Recent Posts

7,500 కోట్ల ఖ‌ర్చు.. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో ముప్పు!

ఏకంగా 7500 కోట్ల రూపాయ‌ల‌ను మంచి నీళ్ల ప్రాయంలా ఖ‌ర్చు చేశారు. మ‌రో వారం రోజుల్లో మ‌హా క్ర‌తువ ను…

2 hours ago

ఇరువురు భామలతో ‘సంక్రాంతి’ వినోదం

https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…

11 hours ago

డబ్బింగ్ హడావిడి లేని మరో సంక్రాంతి

ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…

12 hours ago

‘కుప్పం’ రుణం తీర్చుకుంటున్న చంద్ర‌బాబు!

రాష్ట్రానికి సంబంధించి విజ‌న్‌-2047 ఆవిష్క‌రించిన సీఎం చంద్ర‌బాబు.. తాజాగా త‌న సొంత నియోజ‌క వ‌ర్గం.. 35 ఏళ్ల నుంచి వ‌రుస…

14 hours ago

చంద్ర‌బాబు సూప‌ర్‌ విజ‌న్‌.. జ‌గ‌న్ ది డెట్ విజ‌న్‌!: నారా లోకేష్‌

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌ని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత‌,…

14 hours ago

లైకా వాయిదా ట్విస్టు… మైత్రి మాస్టర్ స్ట్రోకు

గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…

15 hours ago