ఎంతసేపు సెటైర్లు వేయడం.. ఎక్స్ వేదికగా స్పందించడం తప్ప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఆ పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి. ఓ వైపు ఎన్నికల్లో పార్టీకి దారుణ పరాభవం. మరోవైపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై ఆరోపణలు. ఇంకోవైపు ఒక్కొక్కరిగా పార్టీ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు. కానీ కేటీఆర్ మాత్రం రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు, సెటైర్లు వేయడంలోనే బిజీ అయిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
గతంలో కేటీఆర్‌ను ట్రబుల్ షూటర్ అని, గురి తప్పని నాయకుడు అని పొగిడారు. అప్పుడు అధికారం ఉంది కాబట్టి ఏం చేసినా, చెప్పినా చెల్లింది. కానీ ఇప్పుడు అధికారం లేదు. ఇలాంటి సమయంలోనే పార్టీని సమర్థంగా నడిపించే వాళ్లను నాయకుడు అంటారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌లో ఆ సామర్థ్యం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్‌పై పసలేని ఆరోపణలు చేయడంలోనే ఆయన మునిగిపోతున్నారు. పార్టీలో ఎవరు ఉంటున్నారో? ఎవరు వెళ్లిపోవాలని అనుకుంటున్నారో ముందుగానే సమాచారం ఉంటుంది. వెళ్లిపోయే ఎమ్మెల్యేలు ఎవరో తెలిసినా వాళ్లను ఆపేందుకు కేటీఆర్ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు.
పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం అది చేయడం లేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగానూ పార్టీ పరిస్థితి దారుణంగా మారుతోంది. నిరుత్సాహంలో ఉన్న కేడర్ కూడా బీఆర్ఎస్‌కు దూరమవుతోంది. అయినా వాళ్లను కాపాడుకునే ప్రయత్నాలను కేటీఆర్ చేయడం లేదు. ఏమైనా అంటే ఆ ఎక్స్‌లో మాత్రం పోస్టులు పెడుతుంటారని కేటీఆర్‌పై విమర్శలు వస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను తప్పించాలని సొంత కేడర్ నుంచే డిమాండ్ వినిపిస్తోందని తెలిసింది.
This post was last modified on July 15, 2024 6:12 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…