ఏపీలో కీలక పథకంపై రాజకీయ వివాదం రేగింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన “తల్లికి వందనం” పథకంపై వైసీపీ నాయకుల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ పథకం అమలుకు ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. నెంబరు 29 కింద ఓ జీవోను ఇష్యూ చేశారు. దీనిలో తల్లికి వందనం పథకం కోసం.. ఆధార్ కార్డును సిద్ధం చేసుకోవా లని.. ఇది లేనివాళ్లు తీసుకోవాలని సూచించారు. ఇంతలోనే దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. తల్లికి వందనం పథకాన్ని ఒక్కరికే పరిమితం చేస్తున్నారంటూ.. వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు.
ఎన్నికలకుముందు.. ఇంట్లో ఎంత మంది స్కూల్కు వెళ్లే పిల్లలు ఉన్నా.. వారికి రూ.15000 చొప్పున పంపిణీ చేస్తామంటూ.. చంద్రబాబు ప్రకటించారు. ఇద్దరుంటే .. 30 వేలు, ముగ్గురంటే 45 వేలు, నలుగురుంటే 60 వేలు ఇస్తామని.. చెప్పిన మాట వాస్తవం. అయితే.. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పటి నుంచి ఈపథకాన్ని అమలు చేస్తామని కూడా చెప్పలేదు. దీంతో రాష్ట్రంలో ఈ విషయం ఒకవైపు చర్చగా మారింది. ఎప్పుడు అమలు చేస్తారంటూ.. కొందరు తల్లులు నాయకులను ప్రశ్నిస్తున్నారు. దీంతో ముందు ఈ రచ్చను సర్దుమణిగేలా చేసేందుకు సర్కారు జీవో 29ని విడుదల చేసింది.
అయితే.. ఎప్పుడు వివాదం చేద్దామని ఎదురు చూస్తున్నారో.. ఏమో వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్‌లు స్పందించి.. అదిగో చంద్రబాబు మాట తప్పుతున్నాడంటూ.. తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు కూడా.. జగన్ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పారు. కానీ, అదికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే పరిమితం చేశారు. ఈ పరిణామంపై అనేక విమర్శలు వచ్చినా.. ఆయన స్పందించలేదు.
ఇక, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో చంద్రబాబును ఏదో ఒకరకంగా ఇరుకున పెట్టాలన్న లక్ష్యంతో వారు ఈ పథకాన్ని ఎంచుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. గతంలో జగన్ మౌనంగా ఉన్నట్టు ఇప్పుడు చంద్రబాబు మౌనంగా లేరు. దీనిపై వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇది కేవలం జీవోనేనని.. విధివిధానాలను తర్వాత ఖరారు చేస్తామని.. ఆధార్ అప్ డేషన్, ఆధార్ లేని వారు అలెర్ట్ అయ్యేందుకు మాత్రమే ఇప్పుడు జీవో ఇచ్చామని వివరణ ఇచ్చుకుంది. అయితే.. వైసీపీ అత్యుత్సాహం.. ఆ పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించేందుకు తావిచ్చింది. గతంలో మాట తప్పిన మీరా? మమ్మల్ని ప్రశ్నించేది అంటూ.. టీడీపీ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on July 12, 2024 9:12 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……