Political News

టీడీపీలో ప‌ద‌వుల ర‌గ‌డ‌.. ఏం జ‌రుగుతోందంటే..!

ఉత్తరాంధ్ర టిడిపిలో పదవుల కలకలం రేగింది. కీలకమైన నాయకులకు సీఎం చంద్రబాబు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఉదాహరణకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలి నుంచి భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అయితే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని, పదవి ఇస్తారని ఆయన వర్గం ఆశించింది. కానీ అట్లాంటిదేమి చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదే సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు కూడా తొలిసారి విజయం దక్కించుకున్నారు.

వాస్తవానికి క్షత్రియ వెలమ సామాజిక వర్గం నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజుకు మంత్రివర్గంలో చోటు తగ్గుతుందని ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు వారికి కూడా అవకాశం కల్పించలేదు. ఇక ఇదే జిల్లాలోని వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన బేబీ నాయన అదే విధంగా ఇతర నాయకులు కూడా మంత్రివర్గంలో సీట్లు దొరుకు దొరుకుతాయని ఆశలు పెట్టుకున్నారు. వారి అసలు కూడా చంద్రబాబు తీర్చ లేకపోయారు. వీరంతా టిడిపిపై ఒకంత అసహనంతో ఉన్నారు. దీంతో ఫ‌లితం వ‌చ్చి నెలరోజులు అయినప్పటికీ.. తొలి వారం రోజులు కొంత హడావిడి చేసినా ఆ తర్వాత మాత్రం అందరూ సైలెంట్ అయిపోయారు.

ఎవరూ బయటికి రావట్లేదు. ఉదాహరణకు విశాఖ రుషికొండపై వైయస్ జగన్మోహన్ రెడ్డి హయంలో పెద్ద ఎత్తున భవనాలు నిర్మించారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకెళ్లి మరి చూపించారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. నిజానిజాలు తెలుసుకోమని చెప్పారు. అయితే ఇదంతా మంత్రివర్గం ఏర్పాటు కాకముందు జరిగింది. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఎక్కడా మాట్లాడటం లేదు. కనీసం మీడియా ముందు కూడా రావట్లేదు. అంటే ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఇక‌, అసోక్ గ‌జ‌ప‌తి రాజు తన కుమార్తెకు మంత్రి పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ఆమెకు కాకుండా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన‌ గుమ్మ‌డి సంధ్యారాణికి అవకాశం కల్పించారు. దీంతో పూస‌పాటి వ‌ర్గం కూడా ఆవేదన‌లో ఉంది. ఇక సంప్రదాయంగా వస్తున్న టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే, పార్టీ గత అధ్యక్షుడు అచ్చం నాయుడుకి పదవి ఇవ్వటం, ఇతర నాయకులను పట్టించుకోకపోవడం కూడా పార్టీలో కొంత అసంతృప్తికి దారితీస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర టిడిపిలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.

మరి దీన్ని చల్లారిచేందుకు చంద్రబాబు ఏమైనా నామినేటెడ్ పదవులను ఇస్తారా లేక నాయకులను బుజ్జగిస్తారా ఇవన్నీ కాదనుకుంటే ఎలా ఉన్నా పరవాలేదు అనుకుని వేచి చూస్తారా అనేది రాజకీయంగా టిడిపిలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఉత్తరాంధ్రలో ఒకింత న‌ర్మగ‌ర్బంగానే ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే విజయనగరం మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల పరిధిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రానుంది. విజయం సాధించాలి అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ నాయకులను ఏకతాటిపైకి తీసుకు వస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

This post was last modified on July 11, 2024 4:18 pm

Share
Show comments

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

44 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago