వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, గుడివాడ ఎమ్మెల్యేగా క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కొడాలి నాని గత నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద అవసరం ఉన్నా, లేకున్నా, వేదిక ఏదైనా ఏకవచనంతో మాట్లాడుతూ నోరు పారేసుకున్నాడు కొడాలి నాని. సంధర్భం, సమయంతో సంబంధం లేకుండా బూతు మాటలతో రెచ్చిపోయాడు.
కట్ చేస్తే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పడిపోయింది. నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఏకంగా 50 వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు. దీంతో టీడీపీ శ్రేణులు ఏకంగా కొడాలి నాని ఇంటిని ముట్టడించినా బయటకు రాలేదు. గత నెల రోజులలో రెండు సార్లు మాత్రమే కనిపించిన కొడాలి అసలు ఎక్కడ ఉంటున్నాడో కూడా అంతుబట్టడం లేదు.
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గత పాలనలో చేసిన తప్పులకు సంబంధించి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు. దీంతో వాలంటీర్లు నానిపై కేసు పెట్టారు. ఆ తర్వాత బెవరేజెస్ గోడౌన్ లో లీజుదారు కూడా కేసు పెట్టాడు. ఈ రెండు కేసుల నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నా తాజాగా వెలుగులోకి వచ్చిన బియ్యం స్కాం నాని మెడకు చుట్టుకునేలా ఉంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సంధర్భంగా బియ్యం కుంభకోణం మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఒక వైపు చంద్రబాబు, మరో వైపు పవన్ కళ్యాణ్, ఇంకో వైపు నారా లోకేష్ లు నానిని టార్గెట్ చేయడంతో అతని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించకుండా అడ్డగోలుగా మాట్లాడడం మూలంగానే నానికి ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు.
పార్టీ కార్యకర్తలకు కూడా నాని అందుబాటులో లేకపోవడంతో గతంలో అతని అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను స్థానికులు తిరిగి ఆక్రమించుకుంటున్నారని సమాచారం. 20 ఏళ్లు గుడివాడలో చక్రం తిప్పిన నాని ఇప్పుడు ఎటూ పాలుపోని సంకట స్థితికి చేరుకున్నాడు.
This post was last modified on July 11, 2024 10:48 am
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…